ఓ హీరోయిన్ ఓ డైరక్టర్ వెంట వెంట సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాడు అంటే కచ్చితంగా ఆ డైరక్టర్ తో ఆ హీరోయిన్ కు లింక్ పెట్టేస్తున్నారు. దీనికి ఉదాహరణ ఈమధ్య వరుస హిట్లు కొడుతున్న ఓ డైరక్టర్ తో కెరియర్ రెండు హిట్లు మూడు ఫ్లాపులతో కొనసాగిస్తున్న ఓ హీరోయిన్ తో ముడి పెట్టారు. దీనిపై స్పందించిన అమ్మడు ఈ చీప్ ట్రిక్స్ నాదగ్గర వద్దని వార్నింగ్ ఇచ్చింది.


కేవలం వ్యూస్ కోసమే మా ఇద్దరి మధ్య లింక్ పెట్టారని.. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని అంటుంది ఆ హీరోయిన్. ఇంతకీ ఎవరా హీరోయిన్.. ఆమెతో ఎఫైర్ అంటూ వార్తలు వచ్చిన ఆ డైరక్టర్ ఎవరు అంటే.. ఆ హీరోయిన్ రాశి ఖన్నా.. ఆ డైరక్టర్ అనీల్ రావిపుడి అని తెలుస్తుంది. పటాస్ తో డైరక్టర్ గా హిట్ అందుకున్న అనీల్ ఆ తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలతో ఆ సక్సెస్ మేనియా కంటిన్యూ చేశాడు.


సుప్రీం సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. తన కెరియర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చిన సినిమాగా రాశి ఖన్నా సుప్రీం సినిమాకు ప్రత్యేక స్థానం ఇచ్చింది. అయితే ఆ తర్వాత అమ్మడు సినిమాతో బిజీగా ఉండగా అదే డైరక్టర్ తీసిన రాజా ది గ్రేట్ సినిమాలో తళుక్కున మెరిసింది రాశి ఖన్నా. 


అసలైతే వచ్చింది రవితేజ కోసం అనుకున్నారు కాని అక్కడ మ్యాటర్ ఏంటంటే అనీల్ రావిపుడితో లింక్ పెట్టారు. ఈ రూమర్స్ కు సరైన టైం చూసి స్పందించాలని చూసిన రాశి ఫైనల్ గా వాటికి చెక్ పెట్టేసింది. అమ్మడు చెప్పిన విధానం చూస్తే ఇకపై తన మీద రూమర్ రాయాలన్న ఆలోచనే రాకుండా చేసింది. ఘాటుగా స్పందించిన రాశి ఖన్నా తాను లవ్ లో పడితే ముందు మీడియాకే లీక్ చేస్తానని చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: