మెగా హీరో.. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కెరియర్ మంచి జోష్ ఫుల్ గా కొనసాగుతుంది. ముకుంద, కంచె, లోఫర్, మిస్టర్ సినిమాలు తీసినా.. కమర్షియల్ గా అతనికి సక్సెస్ ఇచ్చింది మాత్రం ఫిదా. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఫిదా వరుణ్ తేజ్ కెరియర్ లో మొదటి హిట్ సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత తొలిప్రేమతో కూడా హిట్ అందుకున్నాడు వరుణ్ తేజ్.


వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన తొలిప్రేమ ప్రేక్షకుల మనసు గెలిచింది. ఇక ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ ఘాజి డైరక్టర్ సంకల్ప్ రెడ్డితో సినిమా చేస్తున్నాడు. స్పేస్ లో జరిగే కథగా ఈ సినిమా ఉంటుందట. అయితే ఈ సినిమా టైటిల్ గా అహం బ్రహ్మస్మి అని పెట్టబోతున్నారని టాక్. సినిమా టైటిలే చాలా డిఫరెంట్ గా ఉంది. 


దాదాపు ఈ టైటిల్ కన్ఫాం చేశారట. అంతేకాదు ఈ సినిమా కోసం జీరో గ్రావిటిలో ఉండేలా శిక్షణ కూడా తీసుకుంటున్నాడట వరుణ్ తేజ్. కజకిస్థాన్ లో ఈ శిక్షణ ఇస్తారని తెలుసుకుని.. డైరక్టర్ సంకల్ప్ రెడ్డితో వరుణ్ తేజ్ ఈ శిక్షణ కోసం వెళ్తున్నాడట. మొత్తానికి సినిమా కోసం వరుణ్ తేజ్ పెద్ద రిస్క్ చేస్తున్నాడని అనిపిస్తుంది.


మొదటి సినిమా నుడి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్న వరుణ్ తేజ్ ఘాజి డైరక్టర్ తో మరో ప్రయోగం చేస్తున్నాడు. ఈ సినిమా కథ కథనాలన్ని చాలా కొత్తగా ఉంటాయట. ఘాజి తో సబ్ మెరైన్ కథాంశంతో సక్సెస్ సాధించిన సంకల్ప్ రెడ్డి వరుణ్ తేజ్ తో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: