దర్శకుడు ఈవివి సత్యనారాయణ పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ హీరోగా ఫెయిల్యూర్ అయ్యాడు. హాయ్ సినిమాతో హీరోగా పరిచయమై 10 సినిమాల దాకా చేసినా సక్సెస్ మాత్రం దక్కించుకోలేదు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ గా సపోర్టింగ్ రోల్ చేసేందుకు సిద్ధమయ్యాడు ఆర్యన్ రాజేష్. రాం చరణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఆర్యన్ రాజేష్ నటిస్తున్నాడు.


ఈమధ్య హీరోగా సక్సెస్ అవని చాలామంది విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆర్యన్ రాజేష్ కూడా అలాంటి కొత్త టర్న్ తీసుకుంటున్నాడు. బోయపాటి శ్రీను సినిమాలో రాం చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో వివేక్ ఒబేరాయ్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ సోదరుడి రోల్ లో ఆర్యన్ రాజేష్ నటిస్తున్నాడట. 


సినిమాలో ఆర్యన్ రాజేష్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందట. జర్నీ ఫేం అనన్య ఈ సినిమాలో రాజేష్ కు భార్యగా నటిస్తుందట. 2012లో బాలరాజు అండ్ బామ్మర్ది సినిమా తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించడం మానేసిన ఆర్యన్ రాజేష్ ఆ తర్వాత ఈ సినిమాలోనే కనిపిస్తున్నాడు. బోయపాటి సినిమా కాబట్టి ఆర్యన్ కెరియర్ కు ఈ సినిమా కొత్త ఉత్సాహం ఇస్తుందని అంటున్నారు.


అంతేకాదు ఈ సినిమాలో తమిళ హీరో ప్రశాంత్ కూడా నటిస్తాడని తెలుస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెకండ్ షెడ్యూల్ కు సిద్ధమవుతుంది. ఇక ప్రస్తుతం రాం చరణ్ రంగస్థలం సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: