టాలీవుడ్ లో కొంత కాలం వరకు నాని అంటే ఒక చిన్న హీరో. పెద్దగా మార్కెట్ లేని ఓ సాదా సీదా నటుడు. కానీ రెండేళ్ల క్రితం మొదలైన నాని వరుస సక్సెస్ ల జర్నీ... ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. టాలెంట్ కు లక్ తోడైతే అది నాని అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నాని ఏ సినిమాలో నటించినా... దాన్ని ఆడియెన్స్ రిసీవ్ చేసుకోవడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. కొందరైతే... ప్రస్తుతం టాలీవుడ్ లో నాని ట్రెండ్ నడుస్తోందని చెప్పడానికి ఏ మాత్రం మొహమాటపడటం లేదు.

Image result for hero nani awe movie

హీరోగా వరుస విజయాలు అందుకుంటూ తన రేంజ్ ను పెంచుకుంటున్న ఈ న్యాచురల్ స్టార్... రీసెంట్ గా అ సినిమాతో నిర్మాతగా మారి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. డిఫరెంట్ కథాంశంతో, తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారానే పెట్టుబడితో పాటు లాభాలు కూడా వచ్చేశాయి. ఇక ప్రేక్షకుల నుంచి వచ్చే వసూళ్లన్నీ నానికి లాభాలే అనే టాక్ వినిపిస్తోంది. తొలి సినిమాతోనే నిర్మాతగా మంచి విజయాన్ని దక్కించుకున్న నాని... నిర్మాతగా మరిన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నాడు.

Related image

అయితే తాను నిర్మించే సినిమాల విషయంలో కొన్ని కండీషన్లు పెట్టుకున్నాడట ఈ మిస్టర్ డిపెండబుల్ హీరో. తాను తన సొంత బ్యానర్ లో నటించొద్దని డిసైడయిన నాని... కొత్తవాళ్లకు మాత్రమే తన బ్యానర్ లో అవకాశం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చాడట.

Image result for awe movie

అంతేకాదు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనుభవం ఉన్న తాను...తన సొంత సినిమాల కథల విషయంలో కేర్ ఫుల్ గా ముందుకు సాగాలని భావిస్తున్నాడు.  నాని డెసిషన్ ను బట్టి చూస్తే... నిర్మాతగా నాని సరికొత్త  స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడని... డబ్బుల విషయంలో రిస్క్ తీసుకోవద్దని అనుకుంటున్నాడని క్లియర్ గా అర్థమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: