రెజీనా.. పేరు వింటే హాట్ హీరోయిన్ అనుకుంటాం. తను కూడా ఎలాంటి కేరక్టర్స్ అయినా చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. అందాల ప్రదర్శనకు ఏమాత్రం అడ్డు చెప్పకపోయినా రెజీనాకు మాత్రం టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు దక్కలేదు. దక్కినా అవి పెద్దగా ఉపయోగపడలేకపోయాయి. హైట్ కి తగ్గ వెయిట్... కటౌట్ కి మించిన కలరింగ్ తో కుర్రకారుకు గిలిగింతలు పెట్టిన బ్యూటి రెజీనా. బిగినింగ్ లో వరుస మూవీస్ తో సందడి చేసింది. కానీ తరువాతే సీన్ మారకుండా పోయింది. వరుస ప్లాప్స్ తో తన కేరీర్ డైలామాలో పడింది. కట్ చేస్తే.. ఇప్పుడు బాలీవుడ్ మూవీలో ఛాన్స్ పట్టేసింది. అనిల్ కపూర్ తో జోడి కట్టి తన దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోబోతుంది. మరి ఈ సారైనా తనకి కాలం కలిసోస్తుందా?

Image result for regina cassandra

 కొంతమందికి వాళ్లు చేసే కేరక్టర్స్ తో సంబంధం లేకుండా కెరీర్ నడిచిపోతుంటుంది. వాస్తవానికి టాలీవుడ్ లో రెజీనా ఫెయిల్యూర్ హీరోయిన్. అయితే దర్శక నిర్మాతలు ఒక్కోసారి తమ కేరక్టర్ కోసం ఇలాంటి వారికే ఛాన్సెస్ ఇస్తుంటారు. రీసెంట్ గా రెజీనా కూడా ఎక్కువగా అలాంటి పాత్రల్లో కనిపిస్తుండడంతో ఆమెకు సౌత్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇటీవల అ! సినిమాలో రెజీనా చేసిన పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. డ్రగ్స్ కి బానిసైన అమ్మాయిగా నటించి ప్రేక్షకులను మెప్పించింది.

Image result for regina cassandra

 ఇన్నాళ్లూ సౌత్ లోనే సో సో గా సాగుతున్న రెజీనా కెరీర్ పై ఇప్పుడు నార్త్ లో కూడా చర్చ నడుస్తోంది. తాజాగా బాలీవుడ్ లో ఈ లేడీకి మంచి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు తెలుగు తమిళ్ చిత్రాలకే పరిమితమైన ఈ బ్యూటీ ఇక బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వనుంది. షెల్లీ చోప్రా దర్శకత్వంలో ‘ఏక్ లడ్కి కో దేఖా తో ఐసా’ అనే బాలీవుడ్ సినిమా తెరకెక్కనుంది. సోనమ్ కపూర్ - అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో ఒక డిఫెరెంట్ లేడీ రోల్ కోసం చిత్ర యూనిట్ కొంతకాలంగా ఎదురు చూస్తుంది. అయితే రీసెంట్ అ! సినిమా రిలీజ్ అయ్యాక రెజీనా క్యారెక్టర్ చూసి ఫిదా అయిపోయారట.

Image result for regina cassandra

 గతంలో బాలీవుడ్ లోకి వెళ్లడానికి రెజీనా గట్టిగానే ప్రయత్నింది. ఒకనొక టైంలో  అమితాబ్ బచ్చన్ సినిమాలో మెరిసే ఛాన్స్ పట్టేసింది. కానీ ఎందుకో ఆ సినిమా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. తరువాత తెలుగులో రకరకాల ప్రయోగాలు చేసినా కాలం కలిసిరాలేదు పోయింది.  అయితే ఈసారి మాత్రం బాలీవుడ్ లో రెజీనాకి బంపర్ ఆఫర్ వచ్చింది. మరి ఈ కిలాడీ లక్ మారుతుందా..?


మరింత సమాచారం తెలుసుకోండి: