సమాజం తన నిర్ణయాన్ని అసలు స్వీకరిస్తుందా లేదా అని ఆలోచించకుండా తన స్టార్డమ్ ను పక్కనపెట్టి మరీ ఆడవ్యక్తిగా మారబోతున్నాడు ప్రముఖ నటుడు. మంచి ఎత్తు, గంభీరమైన స్వరం, కండలు తిరిగిన శరీర షౌష్ఠవం, అమ్మాయిలను కనుసైగతోనే తనవైపుకు తిప్పేట్టుకొనువంటి ఆకర్షణీయమైన  అందం ఇవన్నీ ఒక నటుడిని తనకు తాను అమ్మాయిగా మార్చుకోవడానికి ఇవేవి ఆపలేదు. కొంపతీసి నిజంగానే తన లింగాన్ని మార్చుకొంటున్నాడని అనుకుంటున్నారా? అదేమీ కాదండోయ్! సినిమాలోని ఒక పాత్రకు పూర్తిగా లేడీ గెటప్ వేయబోతున్నాడు అంతే.


ఇక ఆ ప్రముఖ నటుడు ఎవరో కాదు అతడే ఉన్ని ముకుందన్. ఇతన్ని ఎక్కడో చూసినట్లుందే అని ఆలోచిస్తున్నారా? అవును ఇతను ఎన్టీఆర్ నటించిన  జనతాగ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ కు బావగా మరియు ప్రధాన విలన్ పాత్రలో నటించాడు. అంతేకాదండోయ్ ఇటీవలే వచ్చిన భాగమతి సినిమాలో అనుష్క సరసన కూడా నటించాడు. ముకుందన్ తమిళ, మళయాళ చిత్రసీమలో బిజీ నటుడు. రోజూ చేసే పాత్రలు బోర్ కొట్టాయో లేక తన నటనను నిరూపించుకోవాలనుకున్నాడో ఏమో కాని లేడి గెటప్ వేయబోతున్నాడు.


ప్రస్తుతం ముకుందన్ చాణక్య తంత్రం అనే మలయాళం సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో తను లేడి గెటప్ లో కనిపించబోతున్నాడు. కాగా ఆ పాత్ర కోసం అతను అమ్మాయిలు బ్యూటీ పార్లర్ లో ఎలా ముస్తాబవుతారో, అందాన్ని పెంచుకోవడానికి ఎలాంటి పద్ధతులు అవలంబిస్తారో , ఎలా జాగ్రత్తవహిస్తారో అలాగే కేర్ తీసుకున్నాడు. అందుకు సంబందించిన మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: