స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉంటే తప్ప సినిమా ఇండస్ట్రీలో అవకాశం రావాలంటే నానా అగపాట్లు పడాల్సి వస్తుందని తెలిసిందే. కృష్ణా నగర్ లో ఎంతోమంది కళాకారులు తమ జీవితాన్ని సినిమాకే అంకితం చేసి ఇబ్బందులు పడుతుంటారు. అయితే అవకాశం ఎలా వస్తుంది. ఎటునుండి వస్తుంది అన్నది ఎవరం చెప్పలేం. ప్రస్తుతం బుల్లితెర మీద స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ గెటప్ శ్రీను ఓ ప్రముఖ స్టూడియో దగ్గర అవమానించపడ్డాడట.


కెరియర్ తొలినాళ్లలో సినిమాల మీద ఇష్టంతో తిరుగుతున్న టైంలో అన్నపూర్ణ స్టూడియోలో ఒక సినిమా ఓపెనింగ్ ఉంటే వెళ్లానని అక్కడ తన స్నేహితుడు పనిచేస్తున్నాడని వెళ్తే తను అక్కడ భోజనం చేయించాడని.. కాని అక్కడ ఇంచార్జ్ మాత్రం తింటున్న నన్ను నానా మాటలు అని కాలర్ పట్టుకుని మరి గెటేశారని చెప్పుకొచ్చాడు శ్రీను.


ఆ అవమానంతో వారం దాకా ఏడుస్తూనే ఉన్నానని.. ఇప్పుడు అదే స్టూడియోలో జబర్దస్త్ షూటింగ్ చేస్తున్నామని అన్నారు గెటప్ శ్రీను. తన కెరియర్ లో తన స్నేహితుడు మ్యాగీ తనకు చాలా చేశాడని.. జబర్దస్త్ సుధీర్, రాం ప్రసాద్ తనకు మంచి స్నేహితులని అన్నాడు గెటప్ శ్రీను. మల్లెమాల తమకు లైఫ్ ఇచ్చిందని అందుకే తన ఇంటి పేరు మల్లెమాల నిలయం అని పెట్టానని అన్నారు. ఈమధ్యనే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నాడు గెటప్ శ్రీను. 


ఇక తేజ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారగా అప్పుడు చనిపోవాలన్న వైరాగ్యం వచ్చిందని.. కాని చచ్చి ఏం సాధిస్తాం.. చచ్చేట్టు పనిచేసి సాధించాలని నిర్ణయించుకున్నానని అన్నాడు గెటప్ శ్రీను. ఈమధ్యనే సినిమాల్లో కూడా రాణిస్తున్న శ్రీను ఖైది సినిమా చూసి స్పూర్తి పొందగా.. ఖైది నంబర్ 150 సినిమాలో చిరు పక్కన చిన్న పాత్రలో కనిపించానని చిరుతో నటించడం జీవితంలో మర్చిపోలేనని అన్నాడు శ్రీను. ఇక తన ఎదుగలకు నాగబాబు ఎంతో సహకరించారని అన్నాడు శ్రీను.



మరింత సమాచారం తెలుసుకోండి: