తెలుగులో పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా 2003 లో విడుదలయిన చిత్రం అమ్మానాన్న ఓ తమిళమ్మాయి. ఇది ఆ కాలంలో ఎంత పెద్ద హిట్ అయిందొ అందరికీ తెలిసిందే. ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం కోలివుడ్ లో మంచి పోటీ జరగగా చివరికి జయం ప్రొడక్షన్స్ ఆ హక్కులను సంపాదించింది. ఆ చిత్రానికి జయం రవి హీరోగా నటించగా అక్కడ కూడా ఘన విజయాన్ని సాధించింది. కానీ సినిమాలో బాక్సింగ్ సీన్లు జరిగేటప్పుడు ఒక ప్రేక్షకపాత్ర వహించిన యువకుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడెవరో కాదు విజయ్ సేతుపతి.


సినీ కెరీర్ ఆరంభంలో ఇలానే ప్రాధాన్యం లేని పాత్రలు చేస్తూ వచ్చాడు. 2004 లోనే ఇండస్ట్రీకి వచ్చినా సరైన అవకాశాలు లేక, గుర్తింపు ఉన్న పాత్రలు లేక వెలుగులోకి రాలేకపోయాడు. విజయ్ జీవితాన్ని మార్చిన సినిమా తిన్మెరకు పరువకాట్రు. ఈ 2011 లో విడుదలయిన ఈ సినిమాలో విజయ్ లీడ్ రోల్ లో నటించి అందరిని మెప్పించాడు. ఇక అప్పటి నుండి సినిమా అవకాశాలు తన్నుకువచ్చాయి. విలన్ గా కూడా చేస్తూ కేరీర్ ని చక్కగా మలుచుకున్నాడు. 2014 లో విడుదలయిన పిజ్జా అనే హారర్ చిత్రంతో హీరోగానూ మెప్పించాడు. తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయింది.


విజయ్ సేతుపతి నటిస్తున్న తాజా చిత్రం సూపర్ డీలక్స్. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రస్తుతం హిజ్రాగా అలరించనున్నాడు. ప్రయోగాలు చేయడంలో కోలివుడ్ నటులు ఎప్పుడూ వెనుకాడరని విజయ్ మరోమారు నిరూపించాడు. విజయ్ హిజ్రాగా ముస్తాబయిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న సైరా లో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: