మెగా పవర్ స్టార్ రాం చరణ్, క్రేజీ డైరక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం. 1985 నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా మార్చి 30న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కూడా పక్కా ప్రణాళికా బద్ధంగా చేయాలని నిర్ణయించారు. సినిమాలో చిట్టిబాబుగా రాం చరణ్ కెరియర్ లో ఎన్నడు లేని విధంగా కొత్తగా కనిపిస్తున్నాడు.


ఇక సమంత కూడా రామలక్ష్మిగా పల్లెటూరి పిల్లగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మొదటి సాంగ్ ఎంత సక్కగున్నావే ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా మిగతా సాంగ్స్ త్వరలో విడుదల చేస్తారట. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చి 18 తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా వైజాగ్ లో జరుపుతారట.


రంగస్థలం అటు సుక్కు, ఇటు చరణ్ ఇద్దరికి స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. ధ్రువ తర్వాత ఏరి కోరి సుకుమార్ కథను ఎంచుకున్న చరణ్ చిట్టిబాబు పాత్ర కోసం చాలా కష్టపడ్డాడని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. టీజర్ తో అంచనాలను పెంచగా ఇక సినిమా ప్రేక్షకులకు చేరువేసేలా పర్ఫెక్ట్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట. 


ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వస్తారని తెలుస్తుంది. వైజాగ్ లో మెగా హీరోల ఫంక్షన్స్ అన్ని శుభసూచికలే. అందుకే వైజాగ్ లో రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకున్నారు. మరి అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే మార్చి 30 దాకా వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: