ఈ మద్య తెలుగు హీరోలు వైవిధ్యభరిత పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత  ఇస్తున్నారు.  మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వరుణ్ తేజ్..ముకుంద తో మంచి విజయం అందుకున్నాడు.  ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’లాంటి అద్బుతమైన సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేశాడు.  ఆ తర్వాత లోఫర్ సినిమాతో మాస్ హీరోగా తనను తాను ప్రూఫ్ చేసుకున్నాడు.  ఈ మద్య ఫిదా' .. 'తొలిప్రేమ' వంటి హిట్స్ తో వరుణ్ తేజ్ మాంచి జోరుమీదున్నాడు. 
Image result for ghaji movie
ఇండస్ట్రీలో ఈ మద్య కొత్త దర్శకులు  మొదటి సినిమాతోనే తమ టాలెంట్ ప్రూఫ్ చేసుకుంటున్నారు.  'ఘాజీ' సినిమాతో సంకల్ప్ రెడ్డి తెలుగు తెరకి పరిచయమయ్యాడు. సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో తెలుగులో తొలిసారిగా ఈ సినిమాను తెరకెక్కించిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నాడు. తక్కువ బడ్జెట్ సినిమా అయినా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించి షెబాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన ఎనర్జీతో ఆయన మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు.
Image result for ghazi sankalp reddy
ఈ సారి ఆయన 'గ్రహాంతరవాసి'కి సంబంధించిన కథను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి 'అహం బ్రహ్మాస్మి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట.  అయితే సంకల్ప్ చెప్పిన కథ కథనం మెగా అబ్బాయి వరుణ్ తేజ్ కి బాగా నచ్చిందట. దీంతో ఈ సినిమాకు రెడీ అయినట్లు సమాచారం.  కంటెంట్ పరంగా చూసుకుంటే 'కంచె' తరువాత ఆయన చేస్తోన్న మరో వైవిధ్యభరితమైన చిత్రంగా 'అహం బ్రహ్మాస్మి'ని గురించి చెప్పుకోవచ్చు.

ఈ సినిమా గనక మంచి హిట్ అయితే కొంత కాలం వరకు వరుణ్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. అంతే కాదు ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందని వరుణ్ తేజ్ భావిస్తున్నాడు.      


మరింత సమాచారం తెలుసుకోండి: