సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా పా.రంజిత్ డైరక్షన్ లో వచ్చిన సినిమా కబాలి టీజర్ తోనే సంచలనం సృష్టించింది. ఇక ఆ సినిమా రిలీజ్ తర్వాత అంత సందడి చేయకున్నా సరే రంజిత్ డైరక్షన్ లో రజిని మూవీ చాలా క్రేజీగా మారింది. ఇక ఈ సినిమా తర్వాత పా.రంజిత్ డైరక్షన్ లో కాలా మూవీ వస్తుంది.


ధనుష్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా టీజర్ మార్చి 10న రిలీజ్ చేయబోతున్నారట. కబాలి టీజర్ తో సంచలనం సృష్టించగా పా. రంజిత్ టీజర్ మీద కూడా అంచనాలు పెరిగాయి. యూట్యూబ్ లో కబాలి టీజర్ ఏ రేంజ్ లో షేక్ చేసిందో అందరికి తెలిసిందే. 


అయితే ఇక కాలా టీజర్ ను కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నారట. హ్యూమా ఖురేషి, నానా పటేకర్ నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమాకు పోటీగా తెలుగులో మహేష్ భరత్ అనే నేను, అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాలు వస్తున్నాయి. 


అసలైతే రజిని 2.ఓ ఏప్రిల్ 27న రిలీజ్ అనుకున్నారు కాని ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. రజిని డాన్ గా కనిపిస్తున్న ఈ కాలా పోస్టర్స్ ఇప్పటికే ట్రెండింగ్ లో ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: