బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతుంది.   తాజాగా అసోం రాష్ట్ర పర్యాటక శాఖ కోసం బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా చేసిన హాట్ ఫొటో షూట్ చర్చనీయాంశంగా మారింది.  రాష్ట్ర పర్యాటక శాఖకు ఆమె బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టూరిజం క్యాలెండర్‌ కోసం చేసిన ఫోటో షూట్‌లో ఆమె హాట్‌ హాట్‌గా ఫోజులిచ్చింది. క్లీవేజ్‌ షోతో ఉన్న ఆమె ఫోటోలు రాష్ట్రం మొత్తం అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరం లేవనెత్తింది.

ప్రియాంక చోప్రా ధరించిన గౌను అస్సామీ సంప్రదాయానికి వ్యతిరేకం. ఆదాయం కోసం ప్రభుత్వం మరీ ఇంత దిగజారాలా?. నటీమణులు పద్ధతైన దుస్తుల్లో కనిపించాలే తప్ప.. ఇలా అర్ధనగ్న ప్రదర్శనలకు దిగటం ఏంటి? అంటూ విరుచుకుపడుతున్నారు.  అయితే, ఈ వ్యవహారాన్ని అసోం పర్యాటక మంత్రి హిమంత బిస్వా వెనకేసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడుతోందని... ప్రియాంక ఫొటోల్లో అసభ్యత లేదని చెప్పారు. ఇది పర్యాటక రంగానికి చెందిన అంశమని, రాష్ట్రానికి విదేశీయులు కూడా వస్తుంటారని, వారిని ఆకర్షించాలంటే హీరోయిన్లు ఆకర్షణీయంగానే ఉండాలని తెలిపారు. 
Image result for priyanka hot photos
చిత్రాల్లో నటించే హీరోయిన్లు కూడా అన్ని రకాల దుస్తులు ధరిస్తుంటారన్న విషయం విమర్శలు చేసేవారికి కూడా తెలిసే ఉంటుంది’ అంటూ తెలిపారు. వెంటనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు.. మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.గతంలో బెర్లిన్‌ నగరంలో  ప్రియాంక.. ప్రధాని మోదీని కలిసిన సమయంలో అసభ్యకరమైన దుస్తులు, కాలి మీద కాలేసుకుని కూర్చోని ఉన్న ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా..  ఆమెపై విమర్శలు వినిపించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: