సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) రిలీజ్ ముందు నుంచి నేటి వరకూ వరుస కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే సామాజిక వేత్త దేవి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వర్మను విచారించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ వివాదం క్షమాపణలతో ముగిసిందనుకుంటే..మరో కొత్త కేసు వర్మ మెడకు చుట్టుకుంది. 
Image result for ram gopal varma gst
 ఐద్వా మహిళా నేత మణిపై వర్మ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ విశాఖపట్టణం వేదికగా… పోర్న్ వీడియోలను ప్రమోట్ చేయడంతో పాటు మహిళలను కించపర్చేలా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆయనపై కేసు నమోదు చేయాలనే మహిళా సంఘాలు నిరాహారదీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఏపీ హోం శాఖ మంత్రి చినరాజప్ప ఈ మేరకు విశాఖ పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. 

ఈ నేపథ్యంలో వర్మపై విశాఖలో తాజాగా మరో కేసు నమోదైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్జీవీని అరెస్ట్ చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా తనను బీజేపీ మహిళానేత తుమ్మలపల్లి పద్మ తనను ‘హోమో సెక్సువల్’ అని కించపరిచినట్లు మాట్లాడారని ఆమెపై కేసు నమోదు చేస్తానని ఆర్జీవీ చెప్పిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు, నన్నపనేని రాజకుమారి ఎందుకు చర్యలు తీసుకోరు? అని ప్రశ్నించారు.   విశాఖపట్టణంలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో ఐద్వా మహిళా నేత మణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: