వరుణ్ తేజ్.. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటున్న హీరో. మెగా హీరోలందరిబాటలో కాకుండా ప్రత్యేక జోనర్ ఎంచుకుని ముందుకు సాగుతున్నాడు. అలాంటి జోనర్ లో వచ్చిన తొలిప్రేమ ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైంది.

Image result for varun tej

ఇటీవలికాలం వరకూ వరణ్ తేజ్ కు పెద్దగా హిట్స్ లేవు. కానీ ఈ మధ్యకాలంలో వరుస హిట్స్ వరుణ్ తేజ్ ను వెంటాడుతున్నాయి. దీంతో వరుణ్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. తాజాగ తొలిప్రేమతో సూపర్ హిట్ కొట్టి పండగ చేసుకుంటున్నాడు. ఇప్పటికే తొలిప్రేమతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. అదే జోష్ తో బాక్సాఫీస్ రికార్డులను కూడా వరుణ్ కొల్లగొడుతున్నాడు. గతేడాది శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఫిదా అంటూ వచ్చి టాలీవుడ్ లో సాలీడ్ హిట్ ని ఎకౌంట్ లో వేసుకున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమాతో వరుణ్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఓవర్ సీస్ లో ఆ సినిమా 50 కోట్లు కొల్లగొట్టింది. దీంతో తర్వాత మూవీపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఆ ఫ్లోలో వచ్చిన తొలిప్రేమ అంచనాలను మించి వసూళ్లు చేస్తోంది.

Image result for varun tej

ఓవర్సీస్ మార్కెట్‌లో  తొలిప్రేమ మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దుమ్మురేపుతోంది. రిలీజై రెండు వారాలు కావస్తున్నా శుక్రవారం 39,068 డాలర్లు, శనివారం 68,648 డాలర్లు, ఆదివారం 53,403 డాలర్లు, సోమవారం 26,687 డాలర్లు వసూలు చేసిందంటే.. ఏ స్థాయిలో దూసుకెళుతోందో అర్థం చేసుకోవచ్చు. టోటల్ గా అమెరికాలో 6.30 కోట్ల  గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. వరుణ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు చేసిన సినిమా ఇదే. వన్ మిలియన్ మార్క్ ను దాటేసిన సినిమా కూడా ఇదే కావడం విశేషం.

Image result for varun tej

తెలుగు రాష్ట్రాల్లో కూడా తొలిప్రేమ వసూళ్లపరంగా సత్తా చాటుతోంది. లాస్ట్ 9 డేస్ లో తొ ఈ సినిమా 26.65 కోట్ల గ్రాస్, 16.2 కోట్ల షేర్ సాధించింది. ఇక ఏరియా వైజ్ చూస్తే నైజాంలో 6.20 కోట్ల షేర్, వైజాగ్‌లో 2.56 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 1.38 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.06 కోట్లు, కృష్ణా జిల్లాలో 1.24 కోట్లు, గుంటూరులో 1.31 కోట్లు, నెల్లూరులో 50 లక్షలు వసూలు చేసింది. కర్ణాటకలో 1.2 కోట్లను వసూలు చేయడం గమనార్హం. అలాగే మిగిలిన రాష్ట్రాల్లో 90 లక్షలు వసూలు చేసింది.

Image result for varun tej

ఏదైతేనేం... వరుణ్ తేజ్ కెరీర్ తొలిప్రేమతో మరో టర్న్ తీసుకుంది. దీంతో వరుణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. పైగా.. ‘ఘాజీ’తో సత్తా చాటిన సంకల్ప్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అంతరిక్షం నేపథ్యంలో సాగే సినిమా కావడంతో వరుణ్ ఆస్ట్రోనాట్ గా ఎలా కనిపిస్తాడనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: