తెలుగు తెరపై జంద్యాల దర్శకత్వంలో ‘అహనా పెళ్లంట’ చిత్రంతో అరగుండు బ్రహ్మానందంగా ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చారు. రిలీజ్ అయిన మొదటి సినిమాతోనే ఏ హీరోకి రాని ఇమేజ్ బ్రహ్మానందానికి వచ్చింది.  ఆ తర్వాత వరుసగా తనదైన కామెడీ మార్క్ చాటుకున్న బ్రహ్మానందం వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. అయితే ఈ సినిమాలో బ్రహ్మానందంతో పాటు మరో పాత్రలో గుండు హనుమంత రావు కూడా ఎంట్రీ ఇచ్చారు.  ఇద్దరూ కమెడియన్లుగా ఎంట్రీ ఇచ్చినా..అదృష్టం మాత్రం బ్రహ్మికే బాగా కలిసి వచ్చింది. 
Image result for gundu hanumantha rao brahmanandam
ఈ మద్య గుండు హనుమంత రావు అస్వస్థతతో కన్నుమూసిన విషయం తెలిసిందే.  దీంతో ఆయన తనయుడు ఆదిత్య తల్లి, తొబుట్టువు..చివరికి తండ్రి ని కూడా పోగొట్టుకొని అనాధగా మిగిలాడు.  దీంతో తండ్రికి చేసిన సేవలకు ఆదిత్యను ఇండస్ట్రీ వర్గం ఎంతో గొప్పగా పొగిడింది..అయితే ఆదిత్యకు అండదండగా ఉండేందుకు ఇండస్ట్రీ వర్గం సిద్ద పడ్డారు.  అయితే  గుండు హనుమంత రావు తనయుడు ఆదిత్యను దత్తత తీసుకొని అన్నీ తానై ఉంటానని అండగా ఉంటానని చెప్పారు ఓ ప్రముఖ స్టార్ నటుడు. 

ఇంతకీ ఎవరా నటులు అనుకుంటున్నారా..ఆయనెవరో కాదు హాస్య బ్రహ్మ..టాప్ కమెడియన్ బ్రహ్మానందం.  గుండు హనుమంతరావుకు అత్యంత సన్నిహితుల్లో బ్రహ్మానందం ఒకరు.హనుమంతు కొడుక తన కొడుకుతో సమానమని, అతడికి ఏ లోటూ రాకుండా చూసుకుంటానని బ్రహ్మీ చెప్పినట్లు సమాచారం.
Image result for gundu hanumantha rao brahmanandam
ఆదిత్య చదువు బాధ్యతలతో సహా అతడి పెళ్లి బాధ్యతలు తానే దగ్గకుండి చూసుకుంటానని బ్రహ్మానందం మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు బ్రహ్మానందం మీద ఓ అపోహ ఉంది. అతడు ఎంత సంపాదించినా ఎవరికీ ఒక్కరూపాయి కూడా ఇవ్వరని కొందరు అంటుంటారు.  మరి తన ప్రాణ స్నేహితుడి కొడుకును తన కొడుకులతో సమానంగా చూసుకుంటానని చెప్పడం ఎంతో గర్విచదగ్గ విషయం.. నిజంగా బ్రహ్మానంద ఈజ్ గ్రేట్. 

ఆ బాధ్యతలు నేనే చూసుకుంటాను


మరింత సమాచారం తెలుసుకోండి: