మహేశ్, బన్నీ ఇద్దరూ సూపర్ టాలీవుడ్ స్టార్స్. అయితే ఈ సమ్మర్ కు వీళ్లిద్దరూ ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు ముందుకొస్తున్నారు. ‘భరత్ అను నేను’ సినిమాతో మహేశ్ ప్రమాణ స్వీకారం చేయబోతుండగా.. నా పేరు సూర్య అంటూ అల్లు అర్జున్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అయితే వీళ్లద్దరి మధ్య కొంతకాలంగా జరుగుతున్న వార్ కు ఫుల్ స్టాప్ పడింది. డీల్ కుదిరింది.

Image result for bharat anu nenu

          కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న తాజా సినిమా భరత్ అను నేను. ప్రిన్స్ ఈ సినిమాలో ముఖ్యమంత్రి కేరక్టర్ చేయబోతున్నాడు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న కొరటాల శివ సినిమా కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అలాగే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు సినిమాలను ఏప్రిల్ 26న రిలీజ్ చేయాలని ఆ సినిమా యూనిట్లు డిసైడయ్యాయి.

Image result for na peru surya

          అయితే ఇద్దరు టాప్ స్టార్స్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయాలనుకోవడంపై టాలీవుడ్ మొత్తం షాక్ కు గురైంది. ఇద్దరి సినిమాలకు థియేటర్లు ఎలా పాజిబుల్ అవతాయని అందరూ భావించారు. ఇది రెండు సినిమా నిర్మాతల మధ్య వార్ కు దారి తీసింది. ఒకరికొకరు పోటీ కాకపోయినా యధాలాపంగా ఇద్దరు నిర్మాతలూ ఒకేరోజు సినిమా రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే థియేటర్ల ప్రాబ్లమ్ ఎదురవుతుందని, ఒకరైనా డేట్ ఛేంజ్ చేసుకుంటే బాగుంటుందని సినిమా పెద్దలు పలువురు పరోక్షంగా సూచించారు. అయితే.. రెండు వర్గాల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో ఇద్దరూ అదే డేట్ న సినిమాలు రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయిపోయినట్లు భావించారు.


          అయితే.. సినిమా ఇండస్ట్రీకి ఇది ఎంత మాత్రం మేలు చేయదని భావించిన కొందరు టాలీవుడ్ పెద్దలు మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చారు. దిల్ రాజు, కె.ఎల్.నారాయణ, నాగబాబులు చొరవ తీసుకున్నారు. నిర్మాతలు డి.వి.వి.దానయ్య, లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు.. తదితరులతో కూర్చుని చర్చించారు. చివరకు ఏప్రిల్ 20న భరత్ అను నేను సినిమాను, మే 4వ తేదీన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. డేట్స్ మార్చుకోవాలంటూ తాము చేసిన సూచనలను వెంటనే అంగీకరించిన నిర్మాతలకు దిల్ రాజు, కె.ఎల్.నారాయణ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో.. రెండు సినిమాల మధ్య నెలకొన్న వార్ కు తెరపడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: