ఫాంటసీ, పౌరాణిక కథలను తెరకెక్కించడంలో గుణశేఖర్ తనదైన స్టైల్ లో ముందుకెళ్తున్నారు. ఇటీవలికాలంలో వచ్చిన రుద్రమదేవి సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. అయితే బడ్జెట్ లిమిటేషన్స్ ఆయన్ను కట్టిపడేశాయి. తాజాగా ఆయన హిరణ్యకశిపుడి కథతో ముందుకు రాబోతున్నారు. భల్లాలదేవ రానాతో దీన్ని తెరకెక్కించబోతున్నారు.

Image result for rana daggubati

తెలుగు తెరపై మరో భారీ బడ్జెట్ సినిమాకి రంగం సిద్ధమైంది. హిరణ్య కశిపుడి కథతో పౌరణిక జోనర్ లో ట్రెండ్ సెట్ చేయడానికి రెడీ అయ్యాడు గుణశేఖర్. 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ఈ మూవీలో లీడ్ రోల్ లో నటవిశ్వరూపం చూపించేందుకు రానా సిద్ధమయ్యాడు. మరో నాలుగైదు నెలల్లో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. సురేష్ ప్రొడక్షన్స్, గుణ టీమ్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించబోతున్నారు.

Image result for rana daggubati AND Gunasekhar

టాలీవుడ్ లో కొందరికి రిస్క్ తీసుకోవడమే చాలా ఇష్టం. ఒకటి రెండు సార్లు సినిమా రిజల్ట్ గాడి తప్పినా తనదే పైచేయి అనుకుంటూ మళ్ళీ పరుగెత్తే టాలీవుడ్ దర్శకుల్లో గుణశేఖర్ ఒకడు. పెద్ద పెద్ద హీరోలకే బ్రేక్స్ ఇచ్చిన ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మొన్నీమధ్యే రుద్రమదేవి పేరుతో ఒక అరుదైన సాహసానికి ఒడిగట్టారు. కాకతీయుల చరిత్రను వెండితెరపై అద్భుతంగా చూపించి  తన కలని నెరవేర్చుకున్నాడు. కానీ సినిమా ఆశించిన రిటర్న్స్ ఇవ్వలేకపోయింది.

Image result for rana daggubati

ఈ సినిమా ఇచ్చిన షాక్ నుంచి తేరుకునేందుకు గుణశేఖర్ కు చాలా టైమే పట్టింది. ఇప్పుడిప్పుడే కోలుకున్న గుణశేఖర్ ఇప్పుడు ఓ పౌరాణిక సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. సుమారు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని ప్లాన్ వేశాడు. భక్త ప్రహ్లాదుడి కథతో బ్లాక్ అండ్ వైట్ శకం నుంచి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. నారాయణ మంత్రం అంటూ సాగే ప్రహ్లాదుడి పాట ఇప్పటికీ జనం నోళ్ళలో నానుతూనే వుంది. ఈసారి ప్రహ్లాదుడి కోణంలో కాకుండా అతడి రాక్షస తండ్రి హిరణ్య కశిపుడి వైపునుంచి కథను అల్లుకున్నాడు గుణశేఖర్. బాహుబలిలో భల్లాలదేవ పాత్ర పోషించి నెగిటివ్ రోల్ లో శెభాష్ అనిపించుకున్న రానాని ఈ సినిమాకి హీరోగా సెలక్ట్ చేసుకున్నాడు. పౌరాణిక చిత్రం అంటే భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్‌ అవసరం ఉంటుంది. ఇందుకోసం అయ్యే ఖర్చు కూడా ఎక్కువే. తెరపై దీన్ని రిచ్ గా ప్రజెంట్ చేయాలంటే 150 కోట్ల వరకు అవసరం అని అంచనాకు వచ్చాడు గుణశేఖర్.

Image result for rana daggubati AND Gunasekhar

కేవలం తెలుగులో 150 కోట్లు బడ్జెట్ పెట్టి రాబట్టుకోవడం అంటే కొంచెం కష్టమే. అందుకే దీన్ని తమళం, హిందీల్లో కూడా తీయనున్నారు. మరి ఇవన్నీ వర్కవుట్ అయితే టాలీవుడ్ నుంచి మరో వండర్ ఫిల్మ్ బయటికొచ్చినట్లే.. కేవలం గుణశేఖర్ పైనే అయితే అంతగా హోప్స్ ఉండేవి కావు. సురేష్ ప్రొడక్షన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుండడంతో అంచనాలు పెరిగిపోతున్నాయ్..


మరింత సమాచారం తెలుసుకోండి: