మొదట గా పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుందాము . పవన్ కళ్యాణ్ కు సినిమా మేకింగ్ పై పూర్తి అవగాహన ఉంది.స్క్రిప్ట్ లెవెల్ దగ్గర నుండి కెమెరా యాంగిల్స్ వరకు ప్రతీ విషయం పై పట్టు ఉండటం వలన , షూటింగ్ సెట్ లో దర్శకుడిని ప్రతి సీన్ గురించి అడిగి తెలుసుకుంటాడట. అలానే సన్నివేశం ఇలా ఉంది ఏమిటి అని నిలదీస్తాడట. చాలా మంది అనేది ఏంటి అంటే , పవన్ కళ్యాణ్ వేలు పెట్టడం వల్లనే చాలా సినిమాలు ఫ్లాప్ అవుతాయి అని.
Image result for telugu heros
మహేష్ బాబు ఒకప్పుడు చైన్ స్మోకర్. దాని నుండి బయటపడటానికి చాలానే కష్టపడ్డాడు అంటారు. ఇప్పుడు సిగిరెట్ లు మొత్తంగా మానేసినా మహేష్ బాబు కి కొత్త రకమైన వీక్నెస్ వచ్చి పడింది. షూటింగ్ సెట్ లో సీన్ కి సినిమాకి సంబంధం లేని వారు ఎవ్వరూ ఉండటానికి వీలు లేదు. ఒక వేళ అలా ఎవరైనా వస్తే షూటింగ్ లో నుంచి వెళిపోతా అని కోప్పడతాడట. యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ కి కూడా ఒక వీక్నెస్ ఉంది. మొహమాటం.
Image result for telugu heros
షూటింగ్ సమయంలో లో వచ్చి ఎవరైనా ఏదైనా అడిగితె చెయ్యడానికి చాలా ఆలోచిస్తాడు అంట. మంచి మాటకారి అయిన యన్టీఆర్ ఎదుటి వ్యక్తితో 
మొదటి సారి మాట్లాడటానికి మాత్రం బాగా సిగ్గు పడతాడు అంటారు. అలాగే , యన్టీఆర్ కి అల్లరి బాగా ఎక్కువ. ఒక్క సారి ఆటపట్టించడం మొదలయితే, ఇక ఎవ్వరూ ఆపలేరు అంటుంటారు. హీరో ప్రభాస్ కి సిగ్గు ఎక్కువ. ఏదైనా సరే , లొకేషన్ లో మాత్రం కనిపించడానికి ఇష్టపడతాడు. పది మంది జనం పోగయ్యితే నెర్వస్ గా ఫీల్ అవుతాడని అంటుంటారు. ప్రభాస్ డార్లింగ్ కి కాస్త బద్ధకం కూడా ఎక్కువే అని అంటుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: