మహేష్ భరత్ అనే నేను, అల్లు అర్జున్ నా పేరు సూర్య రెండు సినిమాలు రిలీజ్ విషయంలో కొన్నాళ్లుగా గొడవ పడుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 26న రిలీజ్ అనుకున్న ఈ సినిమాలు ఫైనల్ డిస్కషన్స్ లో చెరో డేట్ కు రిలీజ్ ప్లాన్ చేశారు. మహేష్ నిర్మాత డివివి దానయ్య, బన్ని నిర్మాతలు లగడపాటి శ్రీధర్, బన్ని వాసులు కలిసి సంధి కుదుర్చుకున్నారు.


మహేష్ భరత్ అనే నేను ఏప్రిల్ 20న రిలీజ్ ఫిక్స్ చేయగా.. నా పేరు సూర్య మే 4కి వాయిదా వేశారు. స్టార్ సినిమాలు ఒకేరోజు రావడం వల్ల సినిమా ఫలితాలు ఎలా ఉన్నా ఒక సినిమా ప్రభావం మరో సినిమా మీద పడే అవకాశం ఉంటుంది. అందుకే మహేష్, బన్నిల సినిమాలు ఒకే రోజు రాకుండా దర్శక నిర్మాతలు జాగ్రత్తపడ్డారు. దిల్ రాజు, కే.ఎల్ నారాయణ సపోర్ట్ తో రెండు సినిమాల నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చారు. 


ఈ చర్చలు మొదలవడానికి ముందే మహేష్, బన్ని కూడా ఫోన్ లో మాట్లాడుకున్నారని తెలుస్తుంది. నా పేరు సూర్య యాంగ్రీ సోల్జర్ కథతో వస్తుండగా.. భరత్ అనే నేను మహేష్ సిఎం గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే బన్ని సినిమా టీజర్ అలరించింది. భరత్ అనే నేను సినిమా టీజర్ మార్చి 18 ఉగాది కానుకగా రిలీజ్ చేస్తారట.


భారీ అంచనాలతో వస్తున్న ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది. అంచనాలను అందుకుంటే ఈ రెండు సినిమాలు సంచలన విజయాలు అందుకునే అవకాశం ఉంది. ఇక మార్చి 30న రాం చరణ్ రంగస్థలం కూడా అంచనాలతో వస్తుంది. సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్.   


మరింత సమాచారం తెలుసుకోండి: