సంచలన దర్శకుడు గాడ్ సెక్స్ ట్రూత్ సినిమా రామ్ గోపాల్ వర్మకు అనుకోని కష్టాలను తెచ్చిపెడుతోంది. ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేసిన సామాజిక కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పోలీసు విచారణను ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా సినిమా మొత్తం విదేశాల్లోనే షూట్ చేశారని, తాను స్కైప్ ద్వారా కొన్ని సూచనలు మాత్రమే చేశానని వర్మ చెప్పారు. పోర్న్, న్యూడ్ ఫిలిం జీఎస్టీని వర్మ హైదరాబాద్‌లో తెరకెక్కించాడనే మరో వివాదం వర్మకు చుట్టుకుంది. 
Image result for gst movie
ఇప్పుడు మరో విషయం సంచలనం రేకిత్తిస్తోంది. 'జీఎస్టీ' చిత్రాన్ని హైదరాబాదులోనే తెరకెక్కించారని ఓ ప్రతిక కథనాన్ని ప్రచురించింది. మియా మాల్కోవా కూడా హైదరాబాదుకు వచ్చిందని కథనంలో పేర్కొంది. వీటన్నింటికీ తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పింది. హైదరాబాదులోని ఓ హోటల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని తెలిపింది.

అందుకు తమ వద్ద ఆధారాలున్నారని కథనంలో పేర్కొన్నారు.  ఇదే నిజమైతే ఆ హోటల్‌పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇండియాలో పోర్న్ సినిమాలు తీయడం నిషిద్ధం. అలాంటిది వర్మ ఆ న్యూడ్ సినిమాను నిజంగా హైదరాబాద్‌లో తీసుంటే... మాత్రం వర్మ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాదు సదరు హోటల్ యాజమాన్యం కూడా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: