సినిమా ప్రపంచం లో విజయాలు, పరాజయాలు సహజం. అయితే విజయం వచ్చినప్పుడు ఒకే గాని, పరాజయం వస్తేనే ఎక్కడకి వెళ్తామో మనకే తెలియదు. ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అని మన పెద్దలు సామెతలు చెపుతుంటారు. ఇది ఏ రంగం లోని వ్యక్తులకైన వర్తిస్తుంది. ఒక్కపుడు బాగా బ్రతికిన వాళ్లు కాలం కలిసి రాకపోతే పతనం తప్పదు. టాలీవుడ్ లో కొంత కాలం టాప్ డైరెక్టర్ గా పేరు పొందాడు శ్రీను వైట్ల.
Image result for srinu vaitla
రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ లతో పోటీగా సినిమాలు తీసిన శ్రీను వైట్ల. ఆ తరువాత వరుస పరాజయాలతో డీలా పడిపోయాడు. నీ కోసం,ఆనందం, వెంకీ, దుబాయ్ శ్రీను, కింగ్, దూకుడు వంటి బ్లాక్ బస్టర్ లు కొట్టిన ఈ డైరెక్టర్ ఒక దశ లో ఫుల్ డిమాండ్ తో ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగాడు. అయితే ఆ తరువాత ఒక దాని తరువాత ఒకటి ఫ్లొప్ లు రావడం తో అయితే మహేష్ బాబు తో వచ్చిన ఆగడు, రామ్ చరణ్ తో వచ్చిన బ్రూస్ లీ, వరుణ్ తేజ్ మిస్టర్ ఫ్లొప్ అవ్వడంతో శ్రీను వైట్ల పరిస్తితి దారుణంగా తయారయింది. అయితే రీసెంట్ గా శ్రీను వైట్ల తన బెస్ట్ ఫ్రెండ్ గా చెప్పుకునే రవి తేజా శ్రీను వైట్లకి ఛాన్స్ ఇద్దాం అని డిసైడ్ అయ్యాడు అంట దానితో ఒక ఫ్యామిలీ మూవీ కి ప్లాన్ చేస్తునట్టు తెలుస్తుంది.
Image result for srinu vaitla
అయితే ప్రస్తుతం శ్రీను వైట్ల భార్య రూప వైట్లకి సంబందించిన ఒక న్యూస్ విపరీతంగా హాల్ చల్ చేస్తుంది. రూప వేదిక్ అనే బ్రాండ్ నేమ్ తో ఆర్గానిక్ పాల వ్యాపారం లోకి అడుగు పెట్టారంట. మన దేశం లో ఇప్పటికే వివిధ రకాల బ్రాండ్ లు ఉన్నాయని. అయితే తమది వ్యాపారం కాదు అని ఒక విప్లవం అని రూప చెబుతుంది. తొలుత తన బ్రాండ్ నేమ్ తో ఆవు పాలు విక్రయిస్తామని రూప వెల్లడించింది. వరల్డ్ ఫేమస్ ఆవులను సేకరించిన పాలను మాత్రమే విక్రయిస్తామని క్రమంగా తమ బ్రాండ్ ద్వార వ్యవసాయ ఉత్పతి కి కావాల్సిన అన్ని సమకూరుస్తామని ఆమె తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: