సినీరంగంలో ఇప్పటి వరకు ఎంతో మంది నటీ,నటులు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  అయితే కొంత మంది కలిసి ఉన్నా చాలా జంటలు అభిప్రాయభేదాల వల్ల విడిపోయారు.  ఈ మద్య వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా చాలా జంటలు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు.  తెలుగు, తమిళ, హిందీ బుల్లితెర తారలు, యాంకర్లు ప్రేమ వివాహాలు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా టీవీ నటి దీపికా కకార్ తాను ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడింది. ‘ససురాల్ సిమర్ కా’ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది దీపికా.  కొంత కాలంగా దీపికా కకార్, షోయమ్ ఇబ్రహీం ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. 


ఈ నేపథ్యంలో వారు వివాహం చేసుకోబోతున్నప్పటి దీపికా హిందూ అమ్మాయి కనుక కొంత కాలం ఆగాల్సి వచ్చింది. చివరికి తన ప్రియుడు కోసం తన పేరును ఫైజ్ గా మార్చుకొని షోయబ్ ఇబ్రహీంను యూపీలో నికాహ్ తో ఒక్కటయ్యారు. ఈ జంట ఈ నెల 26న ముంబై నగరంలో తన తోటి టీవీ నటుల కోసం రిసెప్షన్ ఇవ్వనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.  తన పేరును ఫైజాగా మార్చుకొని ఇస్లాం మతం స్వీకరించి షోయబ్ ఇబ్రహీంను వివాహమాడినట్లు కొందరు చెపుతున్నారు. వెడ్డింగ్ కార్డులో దీపిక తన పేరును ఫైజాగా పేర్కొనడం విశేషం.


కాగా దీపికా మతం మార్చుకోలేదని ఆమె దీపికా ఇబ్రహీంగా మాత్రమే ఉంటుందని,  కేవలం వెడ్డింగ్ కార్డులో మాత్రమే ఫైజాగా పేరు పేర్కొన్నామని షోయబ్ ఇబ్రహీం చెబుతున్నాడు. మొత్తం మీద దీపికా ఇబ్రహీంల వివాహంపై వివాదం రాజుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: