రాబోయేది వేసవి సీజన్..దీంతో ఎక్కువ శాతం సినిమాలు విడుదల చేయడానికి ఇష్టం చూపుతారు స్టార్ హీరోలు, దర్శక, నిర్మాతలు.  వేసవిలో విద్యార్థులకు సెలవలు కావడం..ఎక్కువ మంది సమ్మర్ సీజన్ ఎంజాయ్ మెంట్ ఉంటుంది.  తాజాగా సినీ ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నారు..మార్చి 2నుంచి థియేటర్లు బంద్ చేయబోతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. సినిమా ప్రదర్శనకు సంబంధించిన క్యూబ్, యు.ఎఫ్.ఓ. సంస్థలు నిర్మాతల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నాయని, దీనికి సంబంధించి ఓ పరిష్కారం కావాలని దక్షిణాది రాష్ట్రాల సినీ నిర్మాతల ఐకాస చర్చలు విఫలమయ్యాయి.

బెంగుళూరులో జరిగిన జాయింట్ యాక్షన్ కమిటీ చర్చలు విఫలమవడంతో ఈ వైపు అడుగులు పడనున్నట్లు తెలుస్తోంది. డిజిటలైజేషన్‌లో భాగంగా క్యూబ్ చార్జెస్ అధికంగా వసూలు చేస్తుండడంతో, వాటిని 25 శాతం మేర తగ్గించాలని థియేటర్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. క్యూబ్, యు.ఎఫ్.ఓ.లకు అధిక ధరలు వసూలు చేస్తున్నాయనే అంశాన్ని చర్చించారు.

ఈ పరిణామంతో మార్చి 2 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో సినిమాల ప్రదర్శనలు నిలిపివేయాలని నిర్మాతలు, పంపిణీదారులు నిర్ణయించారు. కాగా, యూఎఫ్ఓ, క్యూబ్ యజమానులు 8.5 శాతం మాత్రమే తగ్గిస్తామని చెప్పడంతో సంతృప్తి చెందని జాయింట్ యాక్షన్ కమిటీ మార్చి 2 నుంచి దక్షిణాదిలోని అన్ని థియేటర్లను బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: