లవర్ బోయ్ నితిన్ హీరోగా చైతన్య కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఛల్ మోహన్ రంగ. త్రివిక్రం కథ అందించిన ఈ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. టీజర్ తో అలరించిన నితిన్ ఇప్పుడు ఈ సినిమాలోని మొదటి సాంగ్ తో పలుకరించాడు.


గా.. ఘా.. మేఘా అంటూ క్యూట్ మెలోడీతో తమన్ మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేశాడని అనిపిస్తుంది. నితిన్ కు జోడిగా మేఘా ఆకాష్ నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఈ ఇద్దరు ఇప్పటికే లై సినిమాలో నటించారు. ఆ సినిమా అంచనాలను అందుకోలేదు అందుకే క్యూట్ లవ్ స్టోరీతో మళ్లీ జత కట్టారు.


త్రివిక్రం కథ కాబట్టి కచ్చితంగా సినిమా మీద అంచనాలు ఉంటాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం అవడం సినిమాకు మరింత క్రేజ్ తెచ్చింది. మొదటి సాంగ్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అవగా.. ఈ సాంగ్ ఫీల్ చూస్తుంటే ఛల్ మోహన్ రంగ తో నితిన్ మ్యూజికల్ హిట్ కొట్టేలానే ఉన్నాడని అనిపిస్తుంది.


మార్చి నుండి ఏప్రిల్ ఎండింగ్ వరకు సినిమాల సందడి బాగానే ఉంది. మార్చిలో నిఖిల్ కిరాక్ పార్టీ, కళ్యాణ్ రాం ఎం.ఎల్.ఏ, మహానటి, రాం చరణ్ రంగస్థలం వస్తుండగా.. ఏప్రిల్ లో ఛల్ మోహన్ రంగ, భరత్ అనే నేను, రజినికాంత్ కాలా సినిమాలు సందడి చేసేందుకు వస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: