రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ప్రేమలో పడ్డాడా.. ఇంతకీ అతను ప్రేమిస్తున్న ఆ లక్కీ భామ ఎవరు.. సినిమాలకు సంగీతాన్ని అందించే దేవి మనసులో సంగీతం మోగించేసిన అమ్మడు ఎవరు అంటే రంగస్థలం సినిమాలో నటించే ఓ ముద్దుగుమ్మకి దేవి శ్రీ ప్రసాద్ మనసు ఇచ్చేశాడని అంటున్నారు. చరణ్ సోదరిగా నటిస్తున్న పూజితను చూసి దేవి ఇంప్రెస్ అయ్యాడట.


సుకుమార్ డైరక్షన్ లో రాం చరణ్ హీరోగా వస్తున్న రంగస్థలం సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ లవ్ కూడా ఉందట. అదేంటి ఆ సినిమాలో దేవి లవ్ ఉండటం ఏంటి అంటే.. సినిమాలో చరణ్ చెల్లి పాత్ర చేస్తున్న పూజితను డిఎస్పి ఇష్టపడుతున్నాడట. ఆమెను చూసిన తొలిచూపులోనే నచ్చేయడంతో ఆమెతో పెళ్లికి సిద్ధమవుతున్నాడని అంటున్నారు. ఇప్పటికే దర్శకుడు సినిమాలో నటించిన అమ్మడు రంగస్థలంలో కూడా చాన్స్ కొట్టేసింది. 


రంగస్థలం సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న దేవి.. ఆ సినిమా షూటింగ్ కు కూడా అటెండ్ అవుతున్నాడు. ఇక కొన్నాళ్లుగా పెళ్లికి తాను సిద్ధమే కాని మనసుకి నచ్చిన అమ్మాయి దొరకట్లేదని చెప్పుకొచ్చిన డిఎస్పి ఫైనల్ గా పూజితకు ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ న్యూస్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేయడమే తరువాయి అంటున్నారు.


మలయాళ భామ అయిన పూజిత చేస్తున్న మొదటి సినిమా రంగస్థలం. సినిమాలో ఆమెది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తుంది. మరి పూజితతో దేవి లవ్ విశేషాలేంటో మరికొద్దిరోజుల్లో బయట పడతాయి. ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ సెలెక్టెడ్ సినిమాలను చేస్తూ తన ఫోకస్ పెళ్లి మీద పెట్టాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: