టాలీవుడ్ లో యుద్ధాలు కొత్తకాదు.. చాలాసార్లు సినిమాల మధ్య, హీరోల మధ్య, హీరోయిన్ల మధ్య యుద్ధాలు చూశాం. ఈసారి కూడా టాలీవుడ్ ల పెద్ద యుద్ధమే జరుగుతోంది. అయితే ఈసారి జరుగుతున్న యుద్ధం మాత్రం ఓ డేట్ కోసం..!! ఇంతకూ ఆ డేట్ లో ఏముంది..?

Image result for na peru surya

టాలీవుడ్ లో ఏప్రిల్ 27 ఇప్పుడు హాట్ డేట్. ఈ డేట్ లో ఏముందో ఏమో గాని చాలాకాలంగా ఈ డేట్ కోసం పెద్ద యుద్ధమే జరుగుతోంది. అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్య రిలీజ్ కోసం ఈ డేట్ పై ఫస్ట్ కర్చీఫ్ వేసి కూర్చున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రిన్స్ మహేశ్ బాబు అదే డేట్ ను బుక్ చేసుకున్నాడు. దీంతో ఇద్దరు బడా స్టార్స్ మధ్య వార్ మొదలైంది. ఎవరూ తగ్గకపోవడంతో టాలీవుడ్ పెద్దలు సిట్టింగ్ వేసి మ్యాటర్ సెట్ చేయాల్సి వచ్చింది.

Image result for bharat anu nenu

టాలీవుడ్ లో నా పేరు సూర్య’ ఏప్రిల్‌ 27న విడుదలకు ‘సై’ అంటే.. అదే రోజున ‘భరత్‌ అను నేను’ కూడా రెడీ అయింది. అల్లు అర్జున్‌ 26న వస్తామని చెబితే.. మహేష్‌బాబు చిత్రాన్ని 26నే విడుదల చేస్తామని ప్రకటించారు. దాంతో ఏప్రిల్‌ 26 పైనే అందరి దృష్టీ పడింది. రెండు చిత్రాలూ ఒకేరోజు రావడంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లలో కంగారు పెరిగింది. దీనికి తోడు రెండు చిత్రాల నిర్మాతలు ఎవరికి వాళ్లు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ఈ గొడవ టాలీవుడ్ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందోనని భయపడ్డారు. ఇంతలో రజినీ ‘కాలా’ కూడా అదే డేట్ కి వస్తుండటంతో మ్యాటర్ మరింత హాట్ గా మారింది. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ముదిరి పాకానపడడంతో రంగంలోకి దిగారు సినీ పెద్దలు. రెండు భారీ చిత్రాలు ఒకే రోజు విడుదలవడం ఇండస్ట్రీకి శ్రేయస్కరం కాదని భావించి ఇద్దరు నిర్మాతల మధ్య ఒక అండర్‌ స్టాండింగ్‌ని క్రియేట్ చేసారు. దీంతో ఏప్రిల్‌ 20న 'భరత్‌ అనే నేను', మే 4న 'నా పేరు సూర్య' చిత్రాల్ని విడుదల చెయ్యడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు.

Image result for kala rajini

నిర్మాతల మధ్య రాజీ కుదర్చడం.. రెండు సినిమాల మధ్య అవగాహనకు రావడం అంతా బాగానే ఉంది కానీ.. అంత పట్టుదలగా ఏప్రిల్ 27 కావాలనుకున్నవాళ్లిద్దరూ దాన్ని ఎందుకు వదిలేశారనేదే ఇప్పుడు అర్థం కాని విషయం. ఎవరో ఒకరు వీకెండ్ లో రిలీజ్ చేసుకుని, మరొకరు కాస్త వెనక్కో ముందుకో వెళ్లింటే సరిపోయేది. అలా కాకుండా ఇద్దరూ ఈ సినిమాను వదిలేసి.. రజనీ కాలాకు వదిలేశారు. వీళ్ల అవగాహన సంగతేమో కానీ.. దీని వల్ల ఎక్కువ లాభపడింది మాత్రం రజినీ సినిమానేనని టాలీవుడ్ ఫీలవుతోంది.

Image result for kala rajini

మొత్తానికి బన్ని, మహీల సినిమాల రిలీజ్ డేట్స్ పై క్లారిటి రావడంతో ప్రమోషన్ పై ఫోకస్ పెట్టాయి ఆ సినిమా యూనిట్లు. మార్చి ఫస్ట్ వీక్ లో భరత్ అనే నేను టీజర్ ని రిలీజ్ చేయడానికి కొరటాల శివ ముహూర్తం ఫిక్స్ చేసాడు. ఇక ఊగాదికి ట్రైలర్ తో పాటు ఆడియోను రిలీజ్ చేయనుంది. అయితే వచ్చే ఊగాదికి బన్ని కూడా ఓ సాంగ్ తో పాటు మరో టీజర్ ని లాంచ్ చేయబోతున్నాడు. మొత్తానికి వార్ వన్ సైడ్ అవ్వడంతో ఏప్రిల్ 27న పండగ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు రజనీ. మరి ఈ ముహూర్తం రజనీకి ఎలాంటి బూస్ట్ ఇస్తుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: