స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా మహేష్ బాబు లానే ఫ్యామిలీ లైఫ్ ను కూడా అదే రేంజ్ లో ఎంజాయ్ చేస్తాడు. సినిమా సినిమాకు కొద్ది గ్యాపే ఉన్నా ఆ గ్యాప్ లోనే కుటుంబంతో తగిన సమయాన్ని గడుపుతాడు బన్ని. ఇక ఇప్పుడు మరో వీడియోతో బన్ని బయటకు వచ్చాడు.


తన తనయుడు అల్లు అయాన్ తో ఆడుతున్న బన్ని లేటెస్ట్ సెన్సేషన్ ప్రియా వారియర్ గురి పెట్టిన గన్ మాదిరి.. తన కొడుక్కి అది చూపిస్తూ సరదా క్లిప్ నెట్ లో హల్ చల్ చేస్తుంది. ప్రియా వారియర్ ఫాలోవర్స్ లో ఆమెను ప్రమోట్ చేసిన వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నారు. 


బన్ని ప్రస్థావించడం వల్ల కూడా ఒరు ఆదార్ లవ్ సినిమాకు.. ప్రియా వారియర్ కు మరింత క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఆమెను అనుకరిస్తూ తనయుడు అయాన్ తో బన్ని లీక్ చేసిన ఈ వీడియో మరింత హడావిడి చేస్తుంది. చూస్తుంటే బన్ని తన సినిమాలో ప్రియా వారియర్ ను హీరోయిన్ గా కూడా పెట్టుకునేలా ఉన్నాడని అంటున్నారు.  


ప్రస్తుతం వక్కంతం వంశీ డైరక్షన్ లో నా పేరు సూర్య సినిమా చేస్తున్న బన్ని ఆ సినిమా తర్వాత ఎవరి డైరక్షన్ లో ఉంటుందో తెలియలేదు. అసలైతే లింగుసామి ఎప్పటినుండో బన్నితో సినిమా చేయాలని చూస్తున్నాడు. విక్రం కుమార్ కూడా బన్ని సినిమాకు సై అంటున్నాడు. మరి ఫైనల్ గా ఎవరు బన్నితో సినిమా చేస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: