తెలుగు ఇండస్ట్రీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోయిన్ గా మారిన నటీమణి శ్రీదేవి. 80వ దశకంలో నెంబర్ హీరోయిన్ గా ఒక్క వెలుగు వెలిగిపోయిన శ్రీదేవి అనాటి తరమే కాదు వారి వారసులతో కూడా నటించి మెప్పింది.  తెలుగు, తమిళ, కన్నడ, మళియాళీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన శ్రీదేవి తర్వాత బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.అక్కడ కూడా తన సత్తా చాటుతూ ఎన్నో విజయాలు సాధించింది. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బోనీక కపూర్ ని వివాహం చేసుంది. వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.  ఈ మద్య సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది శ్రీదేవి.  సినిమా ఇండస్ట్రీలో అతిలోక సుందరి సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవా తాజాగా  ఫ్యాషన్‌ ట్రెండ్‌ను ఫాలో అవుతూ వస్తున్నారు. ఇప్పటికే శ్రీదేవి పెద్ద కూతురు సినీ రంగ ప్రవేశం చేసింది. భారతీయ చలన చిత్రం గర్వించదగ్గ లెజండరీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి ఇక లేరు. 

Image result for sridevi passes away

బాలీవుడ్ నటుడు మొహిత్ మార్వా వివాహం నిమిత్తం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషి కపూర్‌తో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. సడెన్‌గా హార్ట్ ఎటాక్ రావడంతో ఈ లోకం విడిచి వెళ్లినట్లుగా బాలీవుడ్ వర్గాలు ప్రకటించాయి. దడాక్ చిత్ర షూటింగ్ కారణంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఈ పెళ్ళికి వెళ్లలేదని సమాచారం. బాలీవుడ్‌లో ఫిమేల్ సూపర్ స్టార్‌గా పేరొందిన శ్రీదేవి 13 ఆగస్టు 1963వ తేదీన జన్మించారు. ఆమె అసలు పేరు అమ్మయ్యంగార్‌ అయ్యప్పన్‌. బాలనటిగా కందన్ కరుణ్ సినిమాతో 1967లో సినిమాల్లోకి అరంగేట్రం చేసింది. 1996లో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో శ్రీదేవి వివాహం జరిగింది. ఈ జంటకు జాన్వీ, ఖుషీ అనే ఇద్దరు కుమార్తెలున్నారు.

ఇప్పటి వరకూ 15 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు పొందిన శ్రీదేవిని 2013లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది.  తెలుగులో ‘పదహారేళ్ల వయసు’, హిందీలో ‘సోల్వా సావన్‌’ హీరోయిన్‌గా ఆమెకు తొలి చిత్రాలు కాగా.. అతి తక్కువ కాలంలోనే ఆయా భాషల్లో అగ్ర కథానాయిక రేంజ్‌కి ఎదిగారు శ్రీదేవి. తెలుగులో 85, హిందీలో 71, తమిళంలో 72, మళయాళంలో 26, కన్నడంలో 6 చిత్రాల్లో నటించారు.

ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రంతో రెండో ఇన్నింగ్స్‌ను విజయవంతంగా ప్రారంభించిన శ్రీదేవి, ఆ తరువాత తమిళంలో పులి చిత్రంలోను, చిట్టచివరిగా 2017లో మామ్ సినిమాలోను నటించారు. శ్రీదేవి గత రాత్రి గుండెపోటుతో కుప్పకూలిపోయారు.
Image result for sridevi passes away
ఈ విషయాన్ని శ్రీదేవి సోదరుడు సంజయ్‌ కపూర్‌ ధ్రువీకరించారు.  శ్రీదేవి మరణం ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నామని..భారతీయ సినీ ఇండస్ట్రీ ఓ గొప్ప హీరోయిన్ ని కోల్పోయిందని..తెలుగు వారు గర్వించ దగ్గ గొప్ప హీరోయిన్..నేషనల్ లేవెల్ లో చాలా తక్కువ కాలంలో గొప్ప స్థాయికి ఎదిగిన హీరోయిన్..రామరాజ్యంలో భీమ రాజ్యం..సినిమాలో తనతో పాటు నటించానని..అప్పట్లోనే స్టార్ హీరోల స్థాయిలో పేరు తెచ్చుకున్న గొప్ప హీరోయిన్. 

కామెడీ, సీరియస్ నవరసాలు పండించగల గొప్ప నటి అని సినీ హీరో రాజేంద్ర ప్రసాద్ ఆమె ఆత్మశాంతికి కలగాలిని కోరారు. శ్రీదేవి మరణం పట్ల తెలుగు, హిందీ,తమిళ, కన్న, మళియాళ ఇండస్ట్రీ వర్గం ప్రగాఢ సానుభూతి తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: