భారత ఆరాధ్య నటి అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణవార్త ఎందరి హృదయాల్లోనో విషాదం నింపేసింది. ఈ సంధర్భంలో శ్రీదేవి జీవవనయానాన్ని ప్రతి ఒక్కరు ఙ్జాపకాల దొంతరలను తమ హృదయాలను తిరగేస్తున్నారు. నటిగా శ్రీదేవి సినీ జీవితం అతిలోక సుందరం ఒక సౌంధర్య లహరి అత్యుద్భుతంగా సాగిపోయింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో ఆమె తిరుగులేని కథానాయికగా ఆమె తన స్థానం పదిలపరచుకున్నారు. ఆమె ఏ భాషలో అడుగుపెట్టినా "టాప్-స్టార్-స్టాటస్" ఎంజాయి చేశారామె. 

Image result for sridevi kapoor with south stars

అతిలోక సుందరి శ్రీదేవి - ఆగస్టు 13వ తేది 1963వ సంవత్సరములో తమిళనాడులో శివకాశిలో జన్మించింది, 24 ఫిబ్రవరి 2018 దుబాయిలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈమె తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం తదితర భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది. అందము, అభినయం, నటనలో అలౌకిక నటనను ప్రదర్శించింది.

Image result for sridevi kapoor with south stars

ఆమె తండ్రి అయ్యప్పన్ న్యాయవాది. తల్లి రాజేశ్వరి. శ్రీదేవికి  శ్రీలత, సతీష్ సోదరి సోదరులు ఉన్నారు.  హిందు సాంప్రదాయం ప్రకారం పెద్ద కుమారుడు తల్లి చితికి నిప్పు అంటించాలి. కాని శ్రీదేవి కూతురు అయినప్పటికి, 1997లో తన తల్లి అంత్యక్రియలకు తానే చితికి నిప్పు అంటించిన అభ్యుదయవాది శ్రీదేవి. 



"అమ్మ మాటలు నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. అమ్మానాన్నలు ఎంతో క్రమశిక్షణతో నన్ను పెంచారు. వాళ్లే నా లోకం. వారి మాటలే నాకు వేదవాక్కు. నాన్న చనిపోయిన కొన్ని రోజులకే అమ్మ చనిపోయారు. జుదాయి షూటింగ్ సమయంలో అమ్మ చనిపోయిన విషయం తెలిసింది. అమ్మ ఎప్పుడూ అంటుండేది. తనకు కొడుకైనా కూతురైనా నేనే అని. దీంతో అమ్మ అంత్యక్రియలు నేనే నిర్వహించాను. అదే నా జీవితంలో అత్యంత విషాదకరమైన రోజు. ఆరోజు నా కళ్ల వెంట నీళ్లు రాలేదు.. ఓ నిర్వికార భావన నన్ను అలుముకుంది" అన్నారు.

Image result for sridevi kapoor with south stars

కొన్ని కథనాలు శ్రీదేవి కొంతకాలం హిందీ కథానాయకుడు మిదున్ చక్రవర్తితో కలసి ఉన్నదని, వారిద్దరకూ రహస్యంగా వివాహం చేసుకొన్నారని, అతడు తన మొదటి భార్య అయిన గీతాబాలికి విడాకులు ఇవ్వని కారణంగా అతడికి దూరమయినదని చెపుతాయి. ఇది ఎంతవరకూ నిజం అనేదానికి తగిన ఆధారాలు మాత్రం లేవు.
Image result for ridevi kapoor with senior NTR ANR Sobhan Krishna
తరువాతి కాలంలో ఆమె హిందీ సినీ నిర్మాత, ఆమెతో కలసి ఎన్నో సినిమాలలో నటించిన హీరో అనిల్ కపూర్ సోదరుడు అయిన బోనీకపూర్ ను 1996 జూన్ 2 న వివాహం చేసుకొన్నది. వారిరువురికి జాన్వి, ఖుషి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. 

బాలనటిగా 1967వ సంవత్సరం లో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె అప్రతిహతంగా తన చిత్ర రంగ నట నవ రస వాహినిలో చివరివరకు ఓలలాడారు. శ్రీదేవి ఒక అగ్ర కథానాయిక.  శ్రీదేవి తన నటనా జీవితాన్ని బాలనటిగా "కన్దన్ కరుణాయ్" (1967) అనే తమిళ చిత్రంతో మొదలు పెట్టినది. ఆమె యువ నటిగా తొలుత, ఎక్కువగా తమిళం మరియు, మలయాళం చిత్రాలలో నటించారు. ఆమె నటించిన మలయాళం చిత్రములకు ఎక్కువగా ఐ.వి. శశి దర్శకత్వం వహించారు. ఆమె నటించిన మలయాళ చిత్రములలో చెప్పుకోదగినవి : ఆద్యపాదం, ఆలింగనము, కుట్టవుమ్ శిక్షయుమ్, ఆ నిమషం. 

Image result for sridevi kapoor with south stars

1976 లో బాలచందర్ చిత్రం "మూండ్రు ముదచ్చు"లో కమల్ హాసన్, రజనీకాంత్ లతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా కోణాలలో నుంచి పరిశీలిస్తే ఆ చిత్రం తమిళ చలనచిత్ర సీమకి పెద్ద గుర్తింపు తెచ్చింది. ఇంకా చెప్పాలంటే, ఈ చిత్రం రజనీకాంత్ సినీ జీవితంలో ఒక మైలురాయి. మూండ్రు ముడిచ్చు తరువాత, శ్రీదేవి మరిన్ని విజయవంతమై న చిత్రాలలో వీరితో (కమల్ హాసన్, రజనీకాంత్) కలిసి నటించారు. 

కమల్ హాసన్ తో, ఆమె గురు, శంకర్ లాల్, సిగప్పు రోజక్కల్. తాయుళ్లమాల్ నానిల్లై, మీండుం కోకిల, వాజ్వే మాయం, వరుమైయిన్ సిగప్పు, నీలా మలార్గల్, మూండ్రం పిరై, 16 వయత్తినిలే మొదలగు చిత్రాలలో నటించారు. రజనీకాంత్ గారితో, ఆమె ధర్మయుద్ధం, ప్రియ, పొక్కిరిరాజా, టక్కరిరాజా, అడుతా వారిసు, నాన్ అడిమై ఇల్లై మొదలగు చిత్రాలలో కలిసి నటించారు. 1975-85 సమయంలో ఆమె తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయిక.
Image result for nagarjuna sridevi
అదే సమయంలో, శ్రీదేవి తెలుగు సినిమా రంగంలో కూడా అగ్రశ్రేణి కథానాయకిగా కొనసాగింది. దాదాపు అందరు అగ్ర కథానాయకులతో కలసి నటించింది. ఆమె నటించిన తెలుగు చిత్రాలకు ఎక్కువగా రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు.
Related image
ఎన్.టి.రామారావుతో, ఆమె కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి మొదలగు చిత్రాలలో నటించారు.  అక్కినేని నాగేశ్వరరావుతో, ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక మొదలగు చిత్రాలలో నటించారు. సూపర్ స్టార్ కృష్ణతో కంచుకాగడా, కలవారి సంసారం, కృష్ణావతారం, బుర్రిపాలెం బుల్లోడు మొదలగు చిత్రాలలో నటించారు. ఇంకా శోభన్ బాబు, కృష్ణం రాజు తదితర నటులతో కూడా జంటగా నటించారు. తరవాతి తరం చిరంజీవి  నాగార్జున వెంకటేష్ తో కూడా నటించటం ఆమెకే చెల్లింది.  

Image result for amitabh sridevi

కమల్ హాసన్ తరువాత, శ్రీదేవి కృష్ణ గారితో ఎక్కువ చిత్రాలలో నటించారు. ఆమె తెలుగులో చిత్రాలు చేస్తూనే, హిందీ సినీ రంగంలో అడుగుపెట్టారు. ఆదిలో, ఆమె ఎక్కువ చిత్రాలు జితేంద్రతో నటించారు, వాటిలో అధిక శాతం తెలుగు నుండి అనువదించబడినవి, ముఖ్యంగా రాఘవేంద్రరావు, బాపయ్య దర్శకత్వం వహించినవే.
Image result for nagarjuna sridevi
1978 లో, శ్రీదేవి మొదటి హింది చిత్రం "సోల్వా సావన్" అమోల్ పాలేకర్ తో కలిసి నటించారు, ఆ చిత్రం విజయవంతం కాలేదు. కాని, ఆమె జితేంద్ర గారితో కలిసి నటించిన తదుపరి చిత్రం "హిమ్మత్వాలా" మంచి విజయం సాధించింది. ఆ చిత్రంతో ఆమెను ఉత్తర భారతదేశంలో "ఊరువుల ఊర్వశి థండర్ థైస్) " అని పిలవసాగారు. ఆ ఒక్క చిత్రంతో ఆమె హిందీ చిత్రరంగంలో స్టార్ హీరోయిన్ అయిపొయారు. ఆమె తదుపరి చిత్రం "సద్మ" ఆమెకు మంచి నటిగా గుర్తింపు తెచ్చింది. హిందీ చిత్రసీమలో ఆమెకు ఈ చిత్రం ఒక మైలురాయి. 1980 లలో ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు. 
Image result for kamal rajini sridevi kapoor
ఆమె నటించిన హిందీ అద్భుత సినిమాలు  "నగీన", "మిస్టర్ ఇండియా", "చాందిని", "చాల్ బాజ్".  చాల్ బాజ్ చిత్రానికిగానూ ఆమెకి "మొదటి ఫిల్మ్ ఫేర్ పురస్కారం" లభించింది. మిస్టర్ ఇండియా చిత్రానికి పలు ప్రశంసలు అందుకున్నారు. ఆ చిత్రంతో ఆమెకు "మిస్ హవ హవాయి"  అని పేరు వచ్చింది. ఆమె ఆ చిత్రంలో చార్లీ చాప్లిన్ గా మరువలేని నటనా ప్రతిభ కనబరిచారు. "చాందిని" చిత్రం ఆమె సినీ జీవితంలో మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగులేని కథానాయిక. ఆ సమయంలో ఆమె అధిక పారితోషికం అందుకునేవారు.
Related image
యాష్ చోప్రా ఆమెతో "చాందిని" చిత్రం తరువాత "లమ్హే" (1991) చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి గానూ ఆమె రెండవ ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు, ఇంకా "అంతర్జాతీయ ఉత్తమ నటి" పురస్కారాన్ని కూడా అందుకున్నారు. "ఖుదా గవా" "గుమ్రా" "ఇంగ్లీష్ వింగ్లీష్"  చివరి చిత్రం "మాం"  చిత్రాలలో ఆమె నటనతో ఎంతో మంది హృదయాలను దోచుకున్నారు. 

"హాలీవుడ్"లో ప్రఖాతి గాంచిన ఆంగ్ల చిత్ర దర్శకుడు "స్టీవెన్ స్పీల్బర్గ్" ఆమెతో సినిమా తీయదలచి, ఆమెను సంప్రదించారు. కాని సమయాభావం వలన ఆమె ఆ చిత్రాన్ని తిరస్కరించవలసి వచ్చింది.
Related image
ఎన్నో కోట్లు పెట్టి తీసిన చిత్రం "రూప్ కీ రాణి చోరో కా రాజా" అపజయం అయ్యింది. విజయవంతమైన చిత్రం "జుదాయి" (1997) తరువాత ఆమె వెండితెరకు దూరం అయ్యారు. తరువాత ఆమె, "బోనీ కపూర్" ని వివాహమాడారు. ఇప్పుడు ఆమె ఇద్దరు ఆడపిల్లలకు తల్లి. ఆమె కూతుళ్ళ పేర్లు "జాన్వి" మరియు "ఖుషి".

ఆరేళ్ళ విరామం తరువాత ఆమె సహార ఛానల్ లో ప్రసారింప బడిన "మాలినీ అయ్యర్ (2004 - 05)" అను సీరీయల్ లో నటించారు. అంతే కాకుండా, కరిష్మా కపూర్ నిర్వహించే "జీనా ఇసికే నామ్ (2004)" అనే కార్యక్రమంలో కూడా అతిధిగా కనిపించారు. "కాబూమ్"  (2005) అనే నృత్యపోటీలకు ఒకరోజు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె "ఏసియన్ ఎకాడమి ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్" బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒక సభ్యురాలిగా పనిచేస్తున్నారు.
Image result for sridevi kapoor with south stars
2007 ఫిబ్రవరి 24 న, 52 వ ఫిల్మ్ ఫేర్ పురస్కారాల ప్రధానం రోజున, ఆమె నర్తించి మెప్పించిన 80లలోని కొన్ని పాటలకు, మరల నర్తించి అభిమానులను, తోటి కళాకారు లను వినోదపరిచారు. అలా ఆమె మరోసారి అందరి నుండి ప్రశంసలు అందుకున్నారు.

ఇంతటి అతిలోక అభినేత్రి ఈ దేవత తన అఖిల భారత అభిమానులను ఆసేతు సీతాచలం విషాధవాహినిలో ముంచి  దివికేగిపోయారు. 

Image result for sridevi multifaceted picture

మరింత సమాచారం తెలుసుకోండి: