శ్రీదేవి పుట్టింది తమిళనాడులోని శివకాశి ప్రాంతం అయినా ఆమెను మన తెలుగుప్రజలు తెలుగు అమ్మాయిగానే తమ హృదయాలలో నిలుపుకుని ఆరాధించారు. శ్రీదేవి నటనకు దూరం అయిన తరువాత ఎందరో టాప్ హీరోయిన్స్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ పై తమ ప్రాభవాన్ని చూపించినా శ్రీదేవి స్థానాన్ని మాత్రం ఇప్పటి వరకు ఏ టాప్ హీరోయిన్ చేరుకోలేకపోయింది అన్నది వాస్తవం.
రెండు తరాల హీరోలతో నటించారు
అందంతో పాటు అభినయం సొంతం చేసుకున్న శ్రీదేవికి దరిదాపు 15 కు పైగా ఫిలిం ఫెయిర్ అవార్డ్స్ తో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును అందుకున్న అదృష్టంతో కూడిన సమర్థత ఆమె సొంతం. దాదాపు యాభై ఏళ్ల సినీ కెరియర్ శ్రీదేవి సమర్థతను సూచిస్తోంది. అపురూపమైన  లావణ్యం అతిలోక సౌందర్యంతో కూడిన శ్రీదేవి అందం ఆమెకు శాపంగా మారిందా అన్న కామెంట్స్ ఆమె మరణ వార్త విన్న తరువాత వినిపిస్తున్నాయి. శ్రీదేవి సన్నిహితులు తరుచూ వ్యక్త పరిచే అభిప్రాయం ప్రకారం ఆమెకు అందం పట్ల ఉండే ఇష్టమే ఈ అతిలోకసుందరి అందనిలోకాలకు వెళ్లిపోయింది అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. 
వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు
వయసుతో పాటు శరీరంలో మార్పులు సహజం కానీ శ్రీదేవి మాత్రం ఆ మార్పుల్ని ఆహ్వానించలేకపోయింది అని కొందరంటారు. ఐదు పదుల వయసు దాటినా పదహారేళ్ల అమ్మాయిగానే ఉండాలని కోరుకుంది శ్రీదేవి. దీనికోసం ఆమె తన అందం వన్నె తగ్గకుండా చేయించుకున్న ఎన్నో కాస్మోటిక్ సర్జరీలు స్లిమ్ గా ఉండడం కోసం వాడిన మందులే ఆమె ప్రాణం తీసి ఉండొచ్చని కొందరు శ్రీదేవి సన్నిహితులు తమ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సుమారు 2-3 వారాల కిందట ఒక ఈవెంట్ కు ప్రత్యేక అతిధిగా హాజరైంది శ్రీదేవి. ఆ ఈవెంట్ లో మరింత స్లిమ్ గా కనిపించిన శ్రీదేవిని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.  
1963లో జననం
దీనితో ఆమె ఏదో మళ్ళీ సర్జరీ చేయించుకుందా ? అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు కూడ వ్రాసింది. దీనికితోడు శ్రీదేవి నాజూకుగా కనిపించడం కోసం ఆమె గత కొన్ని సంవత్సరాలుగా విటమిన్ టాబ్లెట్లతోనే కాలం గడిపింది అన్న వార్తలు కూడ వచ్చాయి. శ్రీదేవికి ఆమెకు అందం పట్ల ఉన్న ప్రేమ ఆమెమరణానికి కారణమైందా అన్న అనుమానాలు కూడ చాలామందిలో ఉన్నాయి. తన కూతురుని స్టార్ హీరోయిన్ గా చూడాలని ఎన్నో కలలు కన్న శ్రీదేవి ఆ కలలను నెరవేర్చుకాకుండానే అనంత లోకాలకు వెళ్ళిపోవడం యాదృచ్ఛికం..  


మరింత సమాచారం తెలుసుకోండి: