"I think God is just an arrogant M F and once in a while needlessly shows off his power by abruptly killing who we think to be super humans like Bruce Lee and Sridevi ..I so wish Bruce will give him two kicks one for himself and one for Sridevi" ఇదీ రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి చావు తరవాత రియాక్ట్ అయిన విధానం. ఆమెతో ఎన్నో సినిమాలు చేసిన వర్మ ఆమె మృతి తో తట్టుకోలేక ట్విట్టర్ లో సీరీస్ ఆఫ్ ట్వీట్ లు పెడుతూనే ఉన్నాడు.

రామ్ గోపాల్ వర్మ ఎన్నో సంవత్సరాల నుంచీ శ్రీదేవి అభిమాని అని అందరికీ తెలిసిందే. దాదాపు నాలుగు గంటల పాటు ఆమె మీద వరసగా రామూ ట్వీట్ లు చేస్తూనే ఉన్నాడు .. 'శ్రీదేవి గురించి ఇదే నా ఆఖరి ట్వీట్.. ఇప్పటి నుంచి తను ఇంకా బతికి ఉందనే ఊహించుకుంటాను. శ్రీదేవి గారూ, నేను మిమ్మల్ని ఇంత నవ్వించా.. మీరు ఇప్పుడు నన్నింత ఏడిపించడం అన్యాయం ఇంకెప్పటికీ మీతో మాట్లాడను.. జీవితాంతం కటీఫ్' అంటూ ఆఖరి ట్వీట్ తో ముగించాడు.

అక్కినేని నాగార్జున హీరోగా ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్ర‌స్తుతం ఓ సినిమా తీస్తున్నారు. ఈ రోజు ఆ సినిమా పేరుతో పాటు ఫ‌స్ట్ లుక్ విడుదల చేస్తానని నిన్న ఆయన ప్రకటించారు. అయితే, సినీ నటి శ్రీదేవి మృతితో తీవ్ర విచారం వ్యక్తం చేస్తోన్న రామ్ గోపాల్ వర్మ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.

"'శ్రీదేవి నీవెందుకు ఏడుస్తున్నావు? నీవు మమ్మల్నందరినీ వదిలేసి దూరంగా వెళ్లిపోయినందుకు... ఆ పని మేము చేస్తున్నాం' అంటూ వర్మ తన బాధని ట్విట్టర్ నిండా పోస్ట్ చేసాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: