తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ,  ఇంగ్లీష్, పంజాబీ, భోజ్ పురి ఇలా భాషలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని ప్రాంత భాషల్లోని చిత్రాలలో నటించింది శ్రీదేవి. ఆమె మరణించింది అన్న వార్త తెలియగానే యావత్ భారతం మొత్తం ఒకింత షాక్ కు గురయింది. దుబాయిలోని ఒక వివాహవేడుకకు హాజరయిన ఆమెకు గుండెపోటు రావడంతో మృతిచెందిందన్న విషయం తెలిసిందే.


నాలుగేళ్ల వయసులోనే తుణైవన్ అనే తమిళ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమయింది శ్రీదేవి. 1979 లో సొల్వ సావన్ అనే హిందీ చిత్రం ద్వారా హీరొయిన్ గా తన ప్రస్థానాన్ని కొనసాగించింది. అనతికాలంలోనే అన్ని భాషలలోని చిత్రాలలో నటించి ఎవరూ అందుకోలేని స్థానం సంపాదించింది. పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమాలలో రీఎంట్రీ ఇచ్చి సినిమాలపై తనమక్కువను చాటుకుంది.


కాగా మరణం చివరివరకు ఆమె సినిమా గురించే ఆలోచించిందంటే ఆమెకు సినిమాపట్ల ఉన్న ప్రేమ తెలుస్తుంది. కాతాది అనే తమిళ సినిమా సభ్యులకు విడుదలరోజున అల్ ది బెస్ట్ చెప్పింది. ఇదే ట్విటర్ ద్వారా ఆమె చేసిన చివరి ట్వీటు. కాగా ఆమె మరణం చివరి వరకు సినిమా తప్ప మరే ధ్యాసలేదు అని చెప్పుకుంటూ నెటిజన్లు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: