భారతదేశంలో బహుశా ఏ నటీమణి లేనంత సుదీర్ఘమైన కెరీర్ శ్రీదేవి సొంతం.. ఎందుకంటే నిండా నాలుగేళ్లు కూడా లేకుండానే ఆమె సినీరంగంలో అడుగుపెట్టింది. అది మొదలు ఆమె విశ్రాంతి తీసుకున్నది లేదు. పెళ్లయి పిల్లలు పుట్టిన కొద్ది సమయం నటనకు దూరంగా ఉన్నా.. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది కూడా. అలా దాదాపు 300 సినిమాల్లో శ్రీదేవి నటించింది. 

sridevi raghavendra rao కోసం చిత్ర ఫలితం
అయితే శ్రీదేవి - దర్శకుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్.. పదహారేళ్ల వయస్సు నుంచి జగదేకవీరుడు అతిలోక సుందరి వరకూ వారి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బ్లస్టర్లు గా నిలిచాయి. సినీరంగంలో కొన్ని లెక్కలు ఉంటాయి. అలాగే.. ఓ దర్శకుడి కాంబినేషన్లో ఓ హీరోయిన్ పాతిక సినిమాలు పూర్తి చేసుకోవడం కూడా ఓ రికార్డే..

sridevi raghavendra rao కోసం చిత్ర ఫలితం
కానీ రాఘవేంద్రరావు శ్రీదేవితో 24 సినిమాలు చేశారు. మరో సినిమా చేస్తే పాతిక చిత్రాల రికార్డు ఉండేది. ఇటీవల వారిద్దరూ కలుసుకున్నప్పుడు మరో సినిమా చేయాలని కూడా అనుకున్నారట. ఈ విషయాన్ని రాఘవేంద్రరావు గుర్తు చేసుకున్నారు. ఆ కోరిక తీరకుండానే శ్రీదేవి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. శ్రీదేవి మరణవార్త విని చాలా షాక్ కు గురయ్యానని..అంతటి నటి మళ్లీ తెలుగుతెరపై రావడం చాలా కష్టమని రాఘవేంద్రరావు సంతాపం తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: