ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీల సోష‌ల్ సైట్ అకౌంట్స్ హ్యాక్ అవుతున్నాయి.  తమ సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకోవాలని అనుకుంటున్న వారికి.. హ్యాకింగ్ పెద్ద చిక్కులు తెచ్చి పెడుతోంది. హ్యాకర్లు అసభ్యకరమైన పోస్టులతో వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గతంలో హాట్ అండ్ బోల్డ్ యాక్ట్రెస్ రాధిక ఆప్టే ఫేస్ బుక్ ఎకౌంట్ హ్యాకైంది. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది.
Image result for senior actress radhika
ట్విట్ట‌ర్ ఎకౌంట్‌లో త‌న ఫేస్ బుక్ ఎకౌంట్ హ్య‌క్ అయింద‌ని తెలియ‌జేస్తూ, అభిమానులు ఎవ‌రు మెసేంజ‌ర్ ద్వారా త‌న‌కి మెసేజ్‌లు పంపొద్ద‌ని కోరింది.  ఇటీవల ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్ ట్విట్టర్ హ్యాకింగ్‌కు గురైన విషయం తెలిసిందే.  ప్రముఖ సీనియర్ నటి రాధిక ట్విట్టర్ అకౌంట్ ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు.
Image result for senior actress radhika
నటి రాధిక తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురైందంటూ రాధిక శరత్ కుమార్ పేరుతో ఉన్న తన ట్విట్టర్ పేజీలోనే పోస్ట్ చేశారుదీనిపై ఆమె ఆందోళన వ్యక్తం చేయగా.. నెటిజన్లు ఆమెకు మద్ధతుగా నిలుస్తున్నారు. ‘నా ట్వీటర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ సమస్య నుంచి బయటపడేదాక నాకు మద్ధతుగా నిలవాలంటూ’ నటి రాధిక ట్వీట్ ద్వారా విజ్ఞప్తిచేశారు.
Image result for twitter
డోంట్ వర్రీ మేడమ్ అంటూ ఆమె ఫాలోయర్లు రీ-ట్వీట్లు చేస్తున్నారు. ట్విట్టర్ పేజీలో ఏవేవో సందేశాలు పోస్ట్ చేస్తుండడంతో రాధిక ఈ విషయాన్ని గుర్తించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ..పాలిటిక్స్ రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు రాధిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: