దుబాయ్‌ లో అత్యనత అనుమానాస్పదం గా శనివారం నాదు అనంతలోకాలకు వెళ్ళిపోయిన అఖిలభారత అభిమానుల హృదయ సామ్రాఙ్జి ప్రముఖ నటి శ్రీదేవి పార్థివ దేహం మంగళవారం రాత్రికి కూడా భారత్ కు చేరే అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయి. అంతేకాదు భారత రాయభార కార్యాలయం సహితం ఈ విషయం పై సమాధానం ఇవ్వలేని పరిస్థితి. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన అనంతరం దుబాయ్ పోలీసులు ఆమె మరణం పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉందంటున్నారు అక్కడి పబ్లిక్ ప్రోసిక్యూషన్.  
sridevi kapoor dead body కోసం చిత్ర ఫలితం 
శ్రీదేవి కేసు విచారణను దుబాయ్‌ పోలీసులు పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేశారు. కేసును మరింత లోతుగా అధ్యయనం చేయడంలో భాగంగానే పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. శ్రీదేవి భౌతిక కాయం దుబాయ్‌ పోలీస్‌ "ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌" ఆదీనంలోనే ఉంది. దర్యాప్తు లోతుగా సాగుతున్న నేపథ్యంలో మంగళ వారం కూడా ఆమె డెడ్ బాడీ ఇండియా వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ రోజు పంపలేమని చెప్పిన ప్రాసిక్యూషన్, కేసుపై పునః విచారణ చేస్తోంది. శ్రీదేవి మృతిపై మరింత విచారణ అవసరమని, మృతదేహాన్ని ఈరోజు అప్పగించలేమని దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్ భారత అధికార ప్రతినిధులకు తెలిపారు.
sridevi kapoor dead body కోసం చిత్ర ఫలితం
శ్రీదేవి భౌతిక కాయం కోసం, ఆమె చివరి చూపు కోసం భారత దేశ సినీ అభిమానులు, ప్రజలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రతినిధులు, రాజకీయ నాయకులు రంగం లోకి దిగారు. సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ అమర్‌ సింగ్‌ సౌదీ రాజు తో మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విచారణ వేగవంతం చేసి వీలైనంత త్వరగా శ్రీదేవి భౌతిక కాయాన్ని పంపిస్తామని సౌదీ రాజు హామీ ఇచ్చారని తెలుస్తుంది.
సంబంధిత చిత్రం 
దుబాయ్‌లో జరుగుతున్న తాజా పరిణామాలు అభిమానులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆమె మరణం వెనక ఏమైనా భయంకరమైన విషయాలు వినాల్సి వస్తుందా? అని అభిమానులు కంగారుపడుతున్నారు. అయితే ముంబైలో కొందరు శ్రీదేవి అభిమానులు మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ విషయాలు బయట పెట్టారు. ఆమె గత ఆరు నెలలుగా ముంబై లోని సిద్ధి వినాయక దేవాలయానికి తరచూ వస్తున్నారని, ఆ సమయంలో ఆమె చాలా బాధతో కనిపించేదని అంటున్నారు.
sreedevi siddivinayaka temple mumbai కోసం చిత్ర ఫలితం
శ్రీదేవికి ఏమైనా బాధలుఉన్నాయా? దేవాలయానికి వచ్చి ఆమె మౌనంగా ఎందుకు రోధించినట్లు, కొంతకాలంగా శ్రీదేవి ఇంట్లోపరిస్థితి ఏమిటి? అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాకుండా మోహిత్ మోర్వా వివాహంలో బొనీ మొదటిభార్య బంధువులనుండి ఆమెకు అవమానం ఎదురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు బొనీ తన మొదటి భార్య సంతానంపై చూపే శ్రద్ధ తన సంతానంపై ప్రదర్శించక పోవటం కూడా శ్రీదెవిలో మనస్థాపానికి కారణమౌతుందని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి.  కారణమేదైనా శ్రీదేవి మరణం అభిమానులకు తీరని వ్యధే. అలాగే ఆమె కూతుళ్ళ జీవితం కొంత ప్రమాధంలో పడ్దట్టేనని పలువురు భావిస్తున్నారు.


తొలి భార్య పిల్లలతో బోనీ సఖ్యతపై శ్రీదేవి ఆగ్రహంగా స్పందించినట్లు, ఇది పెళ్లినాటి ప్రమాణాలకు విరుద్ధమని ఆమె గట్టిగా చెప్పినట్లూ తెలుస్తోంది.‘నీ మొదటి భార్యతో ఆర్థిక సంబంధాలు తెంచుకుంటేనే మన వివాహ బంధం మొదలవుతుంది’ అని 1996లో పెళ్లి సమయంలో బోనీకి శ్రీదేవి పెట్టిన షరతు. అప్పటికి సరేనన్న బోనీ ఆ తరువాత మళ్లీ తొలి భార్యతో సంబంధాలు కొనసాగించారని, చివరకు శ్రీదేవి కూడా సమాధానపడ్డారని తెలుస్తోంది.


అయితే ఇపుడు బోనీ - మళ్లీ అర్జున్‌ వైపు చూస్తుండడంతో ఆమెకు కొత్త సమస్య మొదలయ్యింది. ఒక పక్క జాహ్నవిని మంచి నటిగా నిలబెట్టాలని తాను తాపత్రయ పడుతూంటే బోనీ మాత్రం తన పుత్రరత్నం వైపు మనసు పెట్టడం ఆమెలో కల్లోలాన్ని రేపింది.

సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: