బోనికపూర్ కి సినిమాల్లో చాలా నష్టాలు వచ్చాయని, దివాలా తీసే పరిస్థితి వచ్చిందని చాలా మంది అనుకుంటున్నారు. అయితే నిజంగానే బోని కపూర్ కి లాస్ వచ్చిందా.. అని తెలుసుకోవాలంటే, అతను తీసిన సినిమా లను గమనిద్దాం. అప్పట్లో బోనీకపూర్ ఒక బూతు సినిమాను రూపొందించాడు. అదే ‘నో ఎంట్రీ’ 2005లో వచ్చిన ఈ సినిమా తెలుగు వారికి పరిచయం ఉన్నదే. ఎస్వీకే దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్ళాం ఊరెళ్తే’ సినిమా కథతో రూపొందిందే నో ఎంట్రీ. వీటికి మూలం ఒక తమిళ సినిమా.
Image result for boney kapoor and sridevi
తెలుగు, తమిళ వెర్షన్లు చాలా క్లీన్ గా ఉండగా.. హిందీలో దీన్ని బూతు కామెడీగా వండాడు అనీస్ బజ్మీ. ఆ బూతులు జనాలకు ఎక్కాయి. 24కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఏకంగా 74కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమాతో బోనీ సర్ ప్లస్ అయ్యాడు. అప్పుడు శ్రీదేవి స్పందించింది. ‘మా ఆయన రూపొందించిన తాజా సినిమా బాగా ఆడుతోంది. డబ్బులు వచ్చాయి. ఒక్క సినిమాతో బోల్తాపడ్డ బడా నిర్మాతలను నేనెంతో మందిని చూశాను. అయితే అన్ని ఫ్లాఫ్స్ వచ్చినా తట్టుకుని నిలబడ్డ నా భర్త గొప్పవాడు కాదా..’ అని శ్రీదేవి భర్తను సమర్థించింది.
Image result for boney kapoor and sridevi
నో ఎంట్రీ తర్వాత బోనీ కపూర్ మరో సౌత్ రీమేక్ నే ఎంచుకున్నాడు. అదే "పోకిరి" రీమేక్ ‘వాంటెడ్’. ఈ సినిమా హిందీలో కూడా సూపర్ హిట్ గా పేరు తెచ్చుకుంది. భారీ లాభాలు కూడా  తెచ్చుకుంది. ఆ తర్వాత తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ "తేవర్" సినిమాను చేశాడు బోనీ. తెలుగులో సూపర్ హిట్ అయిన "ఒక్కడు"కు రీమేక్ ఇది. ప్రశంసలు రాలేదు కానీ.. పెట్టిన పెట్టుబడి అయితే రాబట్టింది. బోనీ రూపొందించిన చివరి సినిమా "మామ్". ఇందులో శ్రీదేవి ప్రధాన పాత్ర పోషించింది. కమర్షియల్ గా మరీ సూపర్ హిట్ కాలేదు. ఏతావాతా గత పదిపన్నెండేళ్లుగా బోనీ తీసింది ఐదారు సినిమాలే. 
వీటిల్లో డబ్బులు పోగొట్టిన సినిమాలు ఏవీలేవు. అంతో ఇంతో తెచ్చిపెట్టినవే ఉన్నాయి. ఈ రకంగా చూస్తే సినీ వ్యాపారంలో శ్రీదేవి కుటుంబం
పోగొట్టుకున్నది ఏమీలేదు. ఈ ట్రాక్ ను బట్టి చూస్తే మిస్టరీగా మారిన శ్రీదేవి మరణానికి ఆర్థిక పరమైన కారణాలు లేవనే అనుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: