ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగశౌర్య ఇప్పుడు అదే జోష్ తో తన నిర్మాణ సంస్థలో సెకండ్ మూవీ చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా చేసిన చక్రవర్తి సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు టైటిల్ గా @నర్తనశాల అని పెట్టబోతున్నారట. బాలయ్య నర్తనశాల సినిమా చేయాలని ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే.


ఇప్పుడు ఆ టైటిల్ ను నాగశౌర్య వాడేస్తూ షాక్ ఇచ్చాడు. అయితే టైటిల్ చూసి ఇదేదో పొరాణిక చిత్రం అనుకుంటే పొరపాటే అని అంటున్నారు. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అట. ఛలో సినిమాలానే ఫన్ ఫుల్డ్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది. ఐరా క్రియేషన్స్ బ్యానర్లో నాగ శౌర్య ఈ సినిమా నిర్మిస్తుండటం విశేషం. 


ఇక ఈ సినిమాకు సంబందించిన మిగతా స్టార్ కాస్ట్ తెలియాల్సి ఉంది. బాలయ్య తన డైరక్షన్ లో నర్తనశాల చేయాలని చూశాడు. కాని ఆ ప్రయత్నం నెరవేరలేదు. అందుకే నాగశౌర్య సినిమాకు నర్తనశాల అని పెట్టేశాడు. ముందు ఎట్ ది రేటాఫ్ అని ఉంది అంటే కచ్చితంగా ఇది డిఫరెంట్ మూవీ అంటున్నారు.


ఇక ఇవే కాకుండా నాగశౌర్య మరో రెండు క్రేజీ సినిమాలకు సైన్ చేశాడు. కెరియర్ లో హిట్ కంపలసరీ అనుకున్న టైంలో ఛలోతో హిట్ అందుకున్న నాగశౌర్య హిట్ మేనియా కంటిన్యూ చేస్తాడని అనుకుంటున్నారు. డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రయోగాలు చేస్తున్న శౌర్యకు సక్సెస్ రావాలని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: