క్రేజీ బ్యూటీగా ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులను షేక్ చేస్తున్న సాయి పల్లవి పై ఉన్న క్రేజ్ తో పాటుగా ఆమె వ్యవహార శైలి పై రకరకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి విషయాలను పట్టించుకోని సాయి పల్లవి తన పద్ధతిని అదేవిధంగా కొనసాగిస్తూ అవకాశం వచినప్పుడల్లా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ తన ఇమేజ్ ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. 
SAIPALLAVI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈపరిస్తుతుల నేపధ్యంలో ఈమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ హాట్ టాపిక్ గా మారింది. "ఫస్ట్ టైం నేను తల్లినయ్యాను. మాతృత్వం ఎలా ఉంటుందో ఒక చిన్నారితో ఎటాచ్ మెంట్ ఏర్పడితే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు తెలిసొచ్చింది. అమ్మ అనే భావనే చాలా బాగుంటుంది కదా" అంటూ సాయిపల్లవి కామెంట్స్ చేసింది. ఇంకా పెళ్లి కూడ కాని సాయి పల్లవి ఇలా మాతృత్వం గురించి మాట్లాడటం టాపిక్ ఆఫ్ ది మీడియాగా మారింది. 
సంబంధిత చిత్రం
ఈ వ్యవహారం అంతా త్వరలో విడుదల కాబోతున్న సాయి పల్లవి ‘కణం’ సినిమాను ప్రమోట్ చేస్తూ చెప్పిన మాటలు సాయి పల్లవి కెరియర్ లోనే వెరీ స్పెషల్ మూవీగా ఉండబోతోంది అని మీడియాలో వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈమూవీ కథ అంతా తల్లి కూతుళ్ళ చుట్టూ తిరిగే కథ. ఈమూవీలో సాయి పల్లవితో పాటు వెరోనికా అనే చిన్నపిల్ల పాత్ర కూడ ఉంది. 
SAIPALLAVI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
తెలుగు తమిళ భాషలలో నిర్మింపబడిన ఈసినిమాలో సాయి పల్లవి నట విశ్వరూపం చూడబోతున్నారు అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి. ఈమూవీలో మరో కీలక పాత్ర నాగ శౌర్య నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమూవీ షూటింగ్ లోనే నాగ శౌర్యకు సాయి పల్లవికి అభిప్రాయ భేదాలు కూడ వచ్చాయి. ఇదే ఇంటర్వ్యూలో సాయి పల్లవి నాగ శౌర్య గురించి మాట్లాడుతూ తాను ఎవర్నీ ఇబ్బంది పెట్టనని అయితే  తన బిహేవియర్ తో ఎవరైనా ఇబ్బందిపడితే తనకు చాలా బాధ కలుగుతుంది అంటూ మరో ట్విస్టు కూడ ఇచ్చింది. ఏది ఏమైనా క్రేజీ బ్యూటీ సాయి పల్లవి మాతృత్వం పై చాల భావయుక్తంగా మాట్లాడటం ఆమె సున్నితమైన మనసుకు నిదర్శనం అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: