ఈ మద్య కొంత మంది గ్లామర్ హీరోయిన్ నటనకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.  అలాంటి పాత్రలు ఎంచుకొని మరీ నటిస్తున్నారు.  ఈ నేపథ్యంలో దీపికా పదుకొని ‘పద్మావత్’ లాంటి అద్భుత చిత్రంలో లీడ్ రోల్ పోషించి షెభాష్ అనిపించుకుంది. ఇక తెలుగులో అనుష్క కూడా నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది..ఈ నేపథ్యంలో అరుంధతి,సైజ్ జీరో, భాగమతి లాంటి సినిమాలో నటించి మెప్పించింది. తాజాగా వీరి బాటలో నడుస్తుంది..అందాల భామ అనుష్క శర్మ.  ఈ మద్య ప్రముఖ క్రికెటర్ కోహ్లీని వివాహం చేసుకున్న ఈ అమ్మడు కొన్ని పలు సినిమా షూటింగ్స్ లో పాల్గొంటుంది.  

ఎప్పుడూ..అల్ట్రా మోడ్రన్ కాస్ట్యూమ్స్‌తో కనిపించే ముద్దుగుమ్మ ఒక్కసారిగా కాటన్ చీరలో.. చేతికి మట్టి గాజులతో డీ గ్లామర్‌గా కనిపిస్తే గుర్తు పట్టగలమా? కొంచెం కష్టమే కదా.  సింపుల్ కాటన్ చీరలో, చేతికి మట్టి గాజులతో, నుదుటన పెద్ద బొట్టుతో అనుష్క కనిపించింది. మమత అనే పాత్రలో అనుష్క నటిస్తుండగా.. మౌజిగా వరుణ్ నటిస్తున్నాడు. వీరిద్దరూ మంచి ఛాలెంజింగ్ రోల్స్‌లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ అంతా డీ గ్లామరస్ రోల్స్‌లో నటించేందుకు ఇష్టపడుతున్నారు.
Image result for hritik roshan selling appdam
‘సూయి ధాగా’ సినిమాలో వరుణ్ ధావన్, అనుష్క శర్మ ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన దంపతులుగా నటిస్తున్నారు. అందుకే ఈ ముద్దుగుమ్మ ఇలా కనపడుతోంది. ఆ మద్య బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లుక్ కూడా చూశాం. అచ్చం పల్లెటూరి వాడిలా గుర్తించడానికే కష్టంగా క్యారెక్టర్ కోసం తనను తాను మలుచుకున్నాడు హృతిక్.
Image result for shahrukh khan potti
మరో సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా మరుగుజ్జులా నటించేందుకు రెడీ అయిపోయాడు. ఏది ఏమైనా హీరో, హీరోయిన్లు ప్రయోగాత్మక పాత్రల్లో కనిపించి తమను తామ సత్తా ఏంటో నిరూపించుకోవాలని తెగ కష్టపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: