ప్రస్తుతం జూనియర్  ఎన్టీఆర్ పట్టిందల్లా బంగారం అవుతున్న నేపధ్యంలో ఈ నందమూరి హీరో క్రేజ్ టాప్ రేంజ్ లో ఉండటమే కాకుండా జూనియర్ సినిమాల మార్కెట్  చుక్కలను తాకుతోంది.   ఇలాంటి పరిస్థితులలో  ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ మూవీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.  వాస్తవానికి ఈసినిమా ఇప్పటికే ప్రారంభం కావలసి ఉన్నా ‘అజ్ఞాతవాసి’ షాక్ తో ఈసినిమా ప్రారంభం కావడం ఆలస్యం అవుతోంది. దీనితో ఈసినిమా ప్రారంభం కాకుండానే ఈమూవి పై ఇప్పటికే అనేక గాసిప్పులు హడావిడి  చేసాయి. 
ఎన్టీఆర్ కసరత్తులు
వాస్తవానికి త్రివిక్రమ్ ఇప్పటివరకు జూనియర్ ఏసినిమాలోను కనిపించని విధంగా    ఎన్టీఆర్ లుక్ ఉండాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ స్టీవెన్స్ సమక్షంలో ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. తివిక్రమ్ కోరుకున్న లుక్ వచ్చేలా తరచుగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ లు కలుస్తూ ఈ లుక్ గురించి చాలా లోతైన చర్చలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఎన్టీఆర్ లుక్ ఫైనల్ అయ్యాకే ఈ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది అన్న వార్తలు వస్తున్నాయి.  ఈ కారణాల వల్లే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే తేదీ ఆలస్యం అవుతోందని అని అంటున్నారు. 
మునుపెన్నడూ చూడని ఎన్టీఆర్
ఈ సినిమా విషయంలో తారక్ త్రివిక్రమ్ కు ఇచ్చిన టైం టార్గెట్ త్రివిక్రమ్ కు కలవరపాటుకు గురిచేస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈమూవీని ఎట్టి పరిస్తుతులలోను మూడు నెలలులోగా పూర్తి చేయమని జూనియర్ త్రివిక్రమ్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో  అందుకు తగ్గట్టుగా త్రివిక్రమ్ షూటింగ్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అయితే ఈ నెల 26 నుంచి మొదలు కానుంది అని టాక్.  
TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో దర్శకుడు త్రివిక్రమ్  బిజీగా ఉన్ననేపధ్యంలో అప్పుడప్పుడు తారక్ కూడా త్రివిక్రమ్ తో ఈ స్టొరీ చర్చలతో జాయిన్ అవుతున్నాడని టాక్. అంతేకాదు కథకు తగ్గట్టు ప్రతిపాత్ర ఎలా ఉండాలి అనే విషయాల పై ఈఇద్దరు చర్చలు జరుపుతున్నారట. ఇక సినిమాలో ఏ క్యారెక్టర్స్ ఎవరికి ఇవ్వాలి అనే అంశం పై కూడ త్రివిక్రమ్ జూనియర్ తో లోతైన ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను దసరా టైమ్ లో రిలీజ్ చేయాలి అని త్రివిక్రమ్ భావిస్తూ ఉన్నా వేగంగా సినిమాలు తీయడం అలవాటు లేని త్రివిక్రమ్ ఎంతవరకు జూనియర్ టార్గెట్ ను రీచ్ కాగలుగుతాడు అనే విషయం పై ఆసక్తికర కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: