టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నుంచి ఒక విచిత్రమైన పోటీ ఎదురుక్కుంటున్నాడు. ఇప్పటిదాకా బ్రాండ్ ఎండార్స్ మెంట్ల విషయంలో నెంబర్ వన్ గా వెలుగొందుతున్న మహేష్ ఆధిపత్యానికి చాపకింద నీరులా బన్నీ చెక్ పెడుతున్నాడు. మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్ చేస్తున్న పెద్దపెద్ద కంపెనీలకు సరిసమానమైన వేరే కంపెనీలు వారి బ్రాండ్స్ ప్రమోషన్ విషయంలో అల్లుఅర్జున్ మాత్రమే ఎంచుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఉదాహరణకు మహేష్ ప్రమోట్ చేస్తున్న ధమ్స్ అప్ కు సమఉజ్జీ గా ఉండే 7అప్ కు బ్రాండ్ ప్రమోటర్ గా బన్నీ ఉంటున్నాడు.

అలాగే మహేష్ ప్రమోట్ చేస్తున్న యూనివర్సల్ సెల్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ లో గట్టి పోటీ ఇవ్వబోతున్న ‘లాట్’ మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా బన్నీ ఉండటమే కాకుండా ఒక్క హైదరాబాద్ లోనే 30 షాపులు బన్నీ చేత ప్రారంభించడానికి లాట్ కంపెనీ భారీ ఎత్తున ప్రచార కార్యక్రమానికి సిద్దం అవుతోంది. అదేవిధంగా జ్యూలరీ, షాపింగ్ మాల్స్ పబ్లిసిటీ ప్రమోషన్ లో కూడా బన్నీ టాలీవుడ్ ప్రిన్స్ కు గట్టి పోటీ ఇవ్వడం చూస్తూ ఉంటే ఎప్పటికైనా బ్రాండ్ ఎండార్స్ మెంట్లు విషయంలో అల్లుఅర్జున్ మహేష్ స్థానాన్ని ఆక్రమించుకున్నా ఆశ్చర్యం లేదు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఒక్క మాటలో చెప్పాలి అంటే బ్రాండ్ ఎండార్స్ మెంట్ల విషయంలో మాత్రం బన్నీ మన ప్రిన్స్ కు చుక్కలు చూపెడుతున్నాడనే అనుకోవాలి....

మరింత సమాచారం తెలుసుకోండి: