శ్రీదేవి మరణించి వారం రోజులు దాటిపోయినా ఆమె జ్ఞాపకాల నుండి ఆమె అభిమానులు అదేవిధంగా ఇండస్ట్రీ సెలెబ్రెటీలు బయటకు రాలేకపోతున్నారు. ఇప్పటికీ అనేక పత్రికలు మీడియా సంస్థలు శ్రీదేవి పై ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి అంటే ఆమె మరణాన్ని ఇంకా పూర్తిగా అంగీకరించే పరిస్థుతులలో ఎవరు లేరు అన్న వాస్తవం మరొకసారి ఋజువు అవుతోంది. ఇలాంటి పరిస్థుతులలో మెగా స్టార్ చిరంజీవి ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు శ్రీదేవికి ఉన్న సాన్నిహిత్యాన్ని వివరిస్తూ తన చిన్న కూతురు శ్రీజకు శ్రీదేవి పేరును ఎందుకు పెట్టాడో వివరించాడు. 
అత్యంత ప్రజాదరణ
తనతో శ్రీదేవి 1980 ప్రాంతంలో ‘మోసగాడు’ సినిమాలో మొట్టమొదటిసారి నటించిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ అప్పటికే ఆమె క్రేజీ హీరోయిన్ అయిన విషయాన్ని వివరించాడు.  ఎలాంటి పాత్ర చేసినా శ్రీదేవి ఆపాత్రలో ఒదిగిపోతుంది అని చెపుతూ డాన్స్ స్టెప్స్ లో ఆమెతో కలిసి నటించేడప్పుడు తాను ఇంటి దగ్గర కూడ డాన్స్ స్టెప్స్ ప్రాక్టీస్ చేసుకోవలసిన పరిస్థితి తనకు వచ్చిన విషయాలను వివరించాడు చిరంజీవి. 
బాత్రూమ్‌లో అలికిడి లేకపోవడంతో
శ్రీదేవి టాప్ హీరోయిన్ అయిన తరువాత ఆమె తల్లి తన సొంత నిర్మాణ సంస్థలో తనను హీరోగా పెట్టుకుని తెలుగు తమిళ భాషలలో అప్పటి  బాలీవుడ్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్‌ కంపోజ్‌ చేసిన నృత్యాలు ఉండేలా ఓ మ్యూజికల్‌ లవ్‌స్టోరీ ప్రారంభించిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అప్పట్లో అత్యంత భారీ స్థాయిలో ప్రారంభం అయిన ఆ సినిమాను అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించిన విషయాన్ని తెలియచేసాడు. 
 ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది
అయితే కొన్ని కారణాల రీత్యా ఆ సినిమా ఆగిపోయిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆ సినిమాలో శ్రీదేవి పాత్ర పేరు ‘శ్రీజ’ అయిన నేపధ్యంలో ఆసినిమా జ్ఞాపకాలలో భాగంగా తన కూతురు ‘శ్రీజ’ కు ఆపేరు పెట్టిన విషయాన్ని వివరించాడు మెగా స్టార్. రామ్‌చరణ్‌ పెళ్లికి గానీ అదేవిధంగా తన 60వ పుట్టినరోజు వేడుకలకు శ్రీదేవి దంపతులు హాజరైన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ తన కెరియర్ లో నటించిన ఏ హీరోయిన్‌తో లేని అనుబంధం ఆత్మీయత శ్రీదేవితో తనకు ఉన్నాయి అంటూ శ్రీదేవి పై తన అభిమానాన్ని వ్యక్తపరిచాడు..   


మరింత సమాచారం తెలుసుకోండి: