దాసరినారాయణ రావు చనిపోయిన తరువాత ప్రముఖ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భారధ్వాజ దాసరి లేని లోటును తీర్చడానికి ప్రయత్నిస్తూ ఇండస్ట్రీ సమస్యల పై అవకాసం వచ్చినప్పుడల్లా  స్పందిస్తూ అనేక సంచలనాలకు శ్రీకారం చుడుతున్నాడు. ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు యిచ్చిన ఇంటర్వ్యూలో డిజిటల్ సర్వసు ప్రొవైడర్స్  వ్యవహార శైలికి వ్యతిరేకంగా ధియేటర్లు మూసివేయాలని తీసుకున్న నిర్ణయం పై స్పందిస్తూ ఇండస్ట్రీలో ఇంతకన్నా చాల ఎక్కువగా ఉన్న సమస్యల గురించి ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదు అని ప్రశ్నిస్తున్నాడు భరద్వాజ. 
TAMMAREDDY BHARADWAJ LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
జీఎస్టీ విధానం అమలులోకి రావడంతో త్వరలో ప్రధాన నగరాలలోని సినిమా టిక్కెట్ ధర 150 నుండి 200 వరకు పెరుగుతుందని దీనివల్ల భవిష్యత్తులో చిన్న సినిమాలు చూసే ప్రేక్షకులే కరువవుతారని చచ్చిపోతున్న చిన్న సినిమా గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నిస్తున్నాడు భరద్వాజ. ఇదే సందర్భంలో ఈ సంచలన నిర్మాత మాట్లాడుతూ కొందరు నిర్మాతలు ‘ఎల్ ఎల్ పి’ అనే సంస్థను స్థాపించి పబ్లిసిటీ పేరుతో 28 కోట్లు తినేసారని వార్తలు వస్తున్నా నిర్మాతల మండలి కానీ మరే ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు పట్టించుకోరు అని అడుగుతున్నాడు భరద్వాజ. 
TAMMAREDDY BHARADWAJ LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అంతేకాదు “నేను చెప్పేది అబద్ధమైతే మీడియా ముందుకు వచ్చి ఖండించమనండి” అంటూ సవాల్ విసురుతున్నాడు భరద్వాజ. అదేవిధంగా బుక్ మై షో ద్వారా ప్రేక్షకులు టిక్కెట్ బుక్ చేసుకుంటున్నప్పుడు అందులో 50 శాతం ధియేటర్ల వెళ్ళుతోందని ఈ విషయం పై ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు ప్రశ్నించడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నాడు ఈ సంచలన దర్శకుడు. 
THEATERS STRIKE PHOTOS కోసం చిత్ర ఫలితం
అందువల్ల ప్రస్తుతం ధియేటర్లు అన్నీ మూసి ఉన్నప్పుడే ఈ సమస్యల గురించి చర్చలు జరగాలని ప్రధాన సమస్యలు పక్కకు పెట్టి కేవలం సర్వీసు ప్రొవైడర్స్ సమస్యను మాత్రమే హైలెట్ చేస్తూ ముందుకు సాగితే ఇండస్ట్రీలోని సమస్యలు సమస్యలుగానే ఉండిపోతాయి అని అభిప్రాయ పడుతున్నాడు భరద్వాజ. అయితే గతంలో కూడ భరద్వాజ ఇండస్ట్రీని శాసిస్తున్న పెద్దల తీరు పై కామెంట్స్ చేసినా ఎవరూ పట్టించుకోని నేపధ్యంలో ఈ 28 కోట్ల స్కామ్ గురించి కూడ అసలు వాస్తవాలు బయటకు వచ్చే ఆస్కారం లేదు అన్న వాదనలు  వినిపిస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: