నయనతార పెళ్లి.. ఎఫయిర్.. ఈ నటిపై వచ్చినన్ని పుకార్లు బహుశా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఎవరిపనా రాలేదేమో.. మొదట్లో ప్రభుదేవాతో ప్రారంభించి ఆ తర్వాత శింబుతో.. ఇంకా ఇంకా ఎందరితోనో నయనతారకు లింకులు పెట్టి మీడియా పెళ్లిళ్లు చేసేసింది. అంతా మీడియా తప్పు అనే కాదు.. నిప్పులేనిదే పొగరాదు కదా.. 


మొదట్లో ప్రభుదేవాతో ప్రేమను నయనతారే ఒప్పేసుకుంది. ఆ తర్వాత శింబుతో ఎఫయిర్ ను కూడా తాను నిజమేని మీడియా ముందే చెప్పింది.. కానీ వారిద్దరికీ కూడా కుదర్లేదు. విడిపోయారు.  ఆ తర్వాత నయనతారతో లింకులు పెట్టిన పేర్లు మాత్రం ఎక్కువగా మీడియా చేసిన పెళ్లిళ్లు ప్రేమలే. 


మళ్లీ ఇప్పుడు డైరెక్టర్ విఘ్నేష్ తో నయనతార అంటూ కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని నయనతార నేరుగా తానే చెప్పేసింది. ఇప్పుడు ఈ జంట యూఎస్‌లోని లాస్ ఏంజిల్స్‌లో సమ్మర్ వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తోందట. వీరిద్దరూ లాస్ ఏంజిల్స్‌లో తీసుకున్న పిక్స్‌ను నయన్ సోషల్ మీడియాలో తానే స్వయంగా  పోస్ట్ చేసింది.


విఘ్నేష్ తో తమ బంధం గురించి ఎన్ని గాసిప్స్ వచ్చినా ఇప్పటివరకూ నయన్ రియాక్ట్ కాలేదు. కానీ తాజాగా తమ పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. లాస్ ఏంజిల్స్ పిక్స్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన నయన్... ‘స్పెషల్ మూమెంట్స్ అండ్ మెమొరీస్. విక్కీ నయన్’ అని ట్వీట్ చేసింది. సో.. ఈ బంధం ఖాయం అయినట్టేనా..?


మరింత సమాచారం తెలుసుకోండి: