నితిన్ హీరోగా హను రాఘవపుడి డైరక్షన్లో వచ్చిన లై సినిమా నిరాశ పరచింది. టీజర్, ట్రైలర్ తో అబ్బురపరచిన ఆ సినిమాలో మ్యాటర్ మాత్రం నిల్ అని తేలింది. నితిన్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించాడు. ఇక ఆ సినిమా తర్వాత హను శర్వానంద్ తో సినిమా చేస్తున్నాడు.


ఆ సినిమా టైటిల్ గా పడి పడి లేచే మనసు అని పెట్టారు. శర్వానంద్ సరసన ఫిదా భామ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. లై పడేసినా శర్వానంద్ హను ఇమేజ్ ను లేపేలా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. కచ్చితంగా ఈ సినిమా ట్రెండీగా ఉండబోతుందట.


వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న శర్వానంద్ ఈ సినిమాలో కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. నిన్న శర్వానంద్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపుడి ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.


లై హిట్ అయితే నానితో సినిమా కూడా ఉండేది. ఆల్రెడీ కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమా హను డైరక్షన్ లోనే చేశాడు నాని. ప్రస్తుతం శర్వానంద్ తో చేస్తున్న పడి పడి లేచే మనసు ఎలాంటి ప్రేమ పరవశం కలిగిస్తుందో చూడాలి. సినిమా ఫస్ట్ లుక్ లో శర్వా లుక్ అదిరిపోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: