ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేసిన అన్యాయంపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతుంది. దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీలు అని తేడా లేకుండా అందరూ పోరాడుతున్నారు.   ఇప్పటికే ఏపికి చెందిన బిజేపీ, టీడీపీ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయడం పెను సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే.  ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్రజలు, ప్రజా సంఘాలు రోడ్లపై ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
అయితే ఇప్పుడు సినీ పరిశ్రమ నుండి కూడా ప్రత్యేక హోదా డిమాండ్ కు మద్దతూ లభిస్తుంది. 

Image result for ap special status

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని మనిషిగా మారుద్దాం పదండి అంటూ దర్శకుడు కొరటాల శివ పెట్టిన ట్వీట్ పై ఓ వైపు నుంచి ప్రశంసలు వస్తున్నప్పటికీ, మరోవైపు విమర్శలూ వెల్లువెత్తడంతో ఆయన వివరణ ఇచ్చాడు. ఓ బాధ్యతగల పౌరుడిగా మాత్రమే తాను స్పందించానని, రాజకీయాలు, రాజకీయ పార్టీలతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు. 

Image result for modi

సాధారణంగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మనమంతా ఏకతాటిపైకి వచ్చి స్పందిస్తామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటువంటి విపత్తే వచ్చిందని అన్నాడు. తనలోని బాధను ఎటువంటి ఆలోచనలు, లెక్కలు వేయకుండా వ్యక్తపరిచానని, ఇకపైనా అలాగే చేస్తానని, దయచేసి రాజకీయాలు చేయవద్దని కోరాడు. 


సామజిక స్పృహ తో కమర్షియల్ సినిమాలు తీస్తాడనే గుర్తింపు పొందిన కొరటాల శివ తాజాగా సోషల్ మీడియా వేదికగా మోడీకి చురకలు అంటించడంపై చర్చలు కొనసాగుతున్నాయి.  మరి కొరటాల స్ఫూర్తితో ఇండస్ట్రీలో ఎంత మంది ప్రత్యేక హోదాపై తిరుగుబాటు చేస్తారో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: