స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. స్టార్ హీరోలలో కాన్ స్టంట్ గా హిట్లు కొడుతున్న టాలీవుడ్ హీరో. మెగా ఫాలోయింగ్ తో పాటుగా తన స్టైలిష్ యాక్టింగ్ తో అల్లు ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్న క్రేజీ హీరో. కేవలం తెలుగు సినిమాలే చేస్తున్నా అవి డబ్ చేసి రిలీజ్ చేసిన కేరళలో కూడా బన్నికి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.


సరైనోడు, డిజే సక్సెస్ ల తర్వాత వక్కంతం వంశీ డైరక్షన్ లో నా పేరు సూర్య సినిమా చేస్తున్నాడు బన్ని. యాంగ్రీ సోల్జర్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో బన్ని నటనకు అందరు ఫిదా అవ్వాల్సిందే అంటున్నారు. వరుస సినిమాలు హిట్ కొడుతున్నాడన్న కాన్ఫిడెన్సో లేక మరేదో కాని ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న నా పేరు సూర్య సినిమాలో బన్ని వేలు పెట్టుడు ఎక్కువైందని టాక్.  


దర్శకుడి ఆలోచనలు ప్రతి ఒక్కటి అడ్డు పడుతున్నాడట. ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది. సినిమాలో లవ్ సీన్స్ కత్తెరవేస్తూ బన్ని ఎడిటింగ్ టిప్స్ చెప్పాడట. కంటెంట్ మిస్ అవ్వకూడదని లవ్ సీన్స్ తగ్గినా పర్వాలేదని చెప్పాడట. అయితే వంశీ మాత్రం అందుకు నిరాకరించాడని ఇద్దరి మధ్య ఈ విషయంపై గొడవ జరిగిందని అంటున్నారు.


రచయితగా చాలా సినిమాల అనుభవం ఉన్నా దర్శకుడిగా మొదటి సినిమా కాబట్టి వక్కంతం వంశీ బన్ని చెప్పినట్టు నడుచుకోక తప్పట్లేదట. దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన హీరోకి సూపర్ హిట్ ఇచ్చేలా కష్టపడుతున్నాడట. మరి ఫలితం ఎలా ఉంటుంది అన్నది చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: