వివాదాలకు దూరంగా ఉండే హీరో వెంకటేష్ పై ఎప్పుడు సంచలన వార్తలు ఉండవు. అయితే వెంకటేష్ లేటెస్ట్ గా తేజ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు సంబంధించి జరిగిన పొరపాటు పై తీవ్ర అసహనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా జరగడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది అని అంటున్నారు. 
VENKATESH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
టాప్ హీరోల సినిమాలకు సంబంధించి కొందరు  డైరెక్టర్లు తమ సినిమాల్లో హీరోయిన్ ఎవరో చెప్పకుండా సస్పెన్స్ పెడతారు. మరికొందరు దర్శకులు అయితే  తమ సినిమాలో  హీరో లుక్ ఎలా ఉంటుందో చూపించకుండా చివరి వరకు సస్పెన్స్ కొనసాగిస్తారు.   అయితే వెంకటేష్ తేజా దర్శకత్వంలో నటిస్తున్న సినిమా విషయంలో అతడి అభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహారాలు నడవడం వెంకీకి తీవ్ర అసహనాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. 
VENKATESH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
‘దృశ్యం’ సినిమా తరువాత ఒక రకంగా విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ కెరీర్ లో అడుగులు వేస్తున్న వెంకీ ఒక్కో సినిమాకి ఒక్కో కొత్త లుక్ ట్రై చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ‘ఆట నాదే వేట నాదే' సినిమాలో ఒక సాఫ్ట్ లుక్ ట్రై చేస్తున్నాడు. అయితే ఆలుక్ ను చాలాకాలం లీక్ కాకుండా చూసుకోవాలని వెంకీ భావించినట్లు టాక్. అయితే ఎవరు చేశారో తెలియదు కాని ఈ సినిమాలో వెంకీ లుక్ కి సంబంధించి ఒక ఫోటో మీడియాకు లీక్ కావడం అది వెంటనే ఇంటర్నెట్ లో వైరల్ గా మారిపోవడం జరిగిపోయింది. 
VENKATESH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
విషయం తెలిసిన వెంటనే ప్రొడక్షన్ బ్యానర్ అయిన రామానాయుడు స్టూడియోస్ కి చేరుకున్న వెంకటేష్  తన లుక్ ఎలా బయటకు వచ్చింది అని తన వ్యక్తిగత స్టాఫ్ కు క్లాస్ పీకినట్లు టాక్. కళ్ళజోడు పెట్టుకుని బ్యాగ్ తగిలించుకుని చేతిలో పుస్తకంతో కనిపించిన వెంకటేష్ లుక్ అందరికీ బాగా నచ్చినా అప్పుడే ఈసినిమాలోని తన లుక్ బయటకు రావడం వెంకటేష్ కు ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వకపోవడం ఈ విషయంలోని ట్విస్ట్..  

మరింత సమాచారం తెలుసుకోండి: