తెలుగు ఇండస్ట్రీలో ‘జయం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో నటించాడు..కానీ చెప్పుకోదగ్గ హిట్ చిత్రాలు మాత్రం ఏవీ అందుకోలేక పోయాడు..అలాగని మనోడు బ్యాక్ ఏమాత్రం తగ్గకుండా యావరేజ్ హీరో అనిపించుకున్నాడు.  ఆ మద్య త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చి అ..ఆ మంచి విజయం సాధించింది. 
Image result for CHAL MOHAN RANGA
ఈ సంవత్సరం ‘లై’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం నితిన్ ఛ‌ల్ మోహ‌న్ రంగ‌' చిత్రంలో నటిస్తున్నాడు. ఇది నితిన్ కి నితిన్ హీరోగా న‌టించిన‌ 25వ చిత్రం విశేషం. 
Related image
పవ‌న్ క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్‌, శ్రేష్ట్ మూవీస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ క‌థ‌ను అందించారు. మేఘా ఆకాశ్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాకి కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఇదిలా ఉంటే.. త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో పాపుల‌ర్ సాంగ్ 'పెద్ద‌పులి'కి రీమిక్స్ వెర్ష‌న్‌గా రూపొందిన పాట‌ను సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. సాహితి సాహిత్య‌మందించిన ఈ పాట‌ను రాహుల్ సిప్లిగంజ్ గానం చేశారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్య‌రీతులు స‌మ‌కూర్చారు. కాగా, ఏప్రిల్ 5న ఈ సినిమా తెర‌పైకి రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: