రాధిక ఆప్టే ఈ పేరు వింటే చాలు బోల్డ్ నెస్ కు ప్రతి రూపం అని చెప్పవచ్చు. సినిమా లో నగ్నంగా నటించిన బోల్డ్ కామెంట్స్ చేసిన తనకే చెల్లింది. అయితే ఎప్పుడు ఎదో ఒక హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచే  ఈ భామ రీసెంట్ గా మరో కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు మరోసారి తాను వేసుకున్న దుస్తుల విషయంలో అసభ్యకరంగా కామెంట్లు చేస్తు్న్న నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Image result for radhika apte
ఇటీవల రాధిక తన భర్త బెనడిక్ట్‌ టేలర్‌తో కలిసి విహారయాత్ర నిమిత్తం గోవా వెళ్లారు. అక్కడి బీచ్‌లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఫొటోలు బాగున్నాయంటూ పలువురు సానుకూలంగా స్పందిస్తే మరికొందరు బికినీ వేసుకున్నారని, అలా ఉన్నారని, ఇలా ఉన్నారని నోటికొచ్చినట్లు కామెంట్లు పెట్టారు. ఇటీవల రాధికను మీడియా ప్రశ్నిస్తూ.." నెటిజన్ల కామెంట్లకు మీ స్పందన ఏంటి?" అని అడిగారు.
Image result for radhika apte
దీనికి రాధిక స్పందిస్తూ.." ఎవరో చెబితే కానీ నాపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నట్లు తెలియదు. ఇదో చెత్త విషయం. బీచ్‌లో చీర కట్టుకోమంటారా? నాపై కామెంట్లు చేస్తు్న్నవారెవరో నాకు తెలియదు. వారి గురించి నేను  ఆలోచించను" అని ఘాటుగా సమాధానమిచ్చారు రాధిక. తెలుగులో " రక్తచరిత్ర" , ‘లెజెండ్‌’,"లయన్‌" తదితర చిత్రాల్లో నటించిన రాధిక ఇటీవల విడుదలైన ‘ప్యాడ్‌మ్యాన్‌’ చిత్రంతో మంచి విజయం  అందుకున్నారు. ప్రస్తుతం ఆమె పలు హిందీ, ఆంగ్ల సినిమాలతో బిజీగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: